ETV Bharat / bharat

కేరళలో మరో 5వేల కేసులు- ధారావిలో సున్నా - Covid-19 cases in Maharashtra

దేశంలో కేరళ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో 5 వేలకు పైగా కొవిడ్ కేసులు బయటపడగా.. మహారాష్ట్రలో 3 వేలకు పైగా వెలుగుచూసాయి. అయితే ముంబయిలో ధారావిలో తొలిసారిగా ఒక్క కేసు కూడా నమోదవలేదు.

5,397 new COVID19 cases and 4,506 recoveries reported in #Kerala today.
కేరళలో మరో 5వేల కరోనా కేసులు- ధారావిలో జీరో!
author img

By

Published : Dec 25, 2020, 10:17 PM IST

దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదైనప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో అడపా దడపా వైరస్​ బాధితులు పెరుగుతున్నారు. కేరళలో ఒక్కరోజే 5,397 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. 4,506 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

మహారాష్ట్రలో తాజాగా 3,431 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మరో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ముంబయిలోని ధారావి మురికివాడలో శుక్రవారం ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. కరోనా విస్తరణ ప్రారంభమైన నాటి నుంచి రోజూ ఒక్కరైన వైరస్​ బారిన పడే ధారావిలో.. గత 24 గంటల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.

  • మధ్యప్రదేశ్​లో కొత్తగా 1,031 మందికి కరోనా సోకింది. మరో 12 మంది మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 2 లక్షల 36 వేలు దాటింది.
  • కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 1,005 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 5 మరణించారు.
  • దిల్లీలో తాజాగా 758 కొవిడ్ కేసులు వెలుగుచూడగా.. 30 మంది మృతి చెందారు.​ 1,370 మంది కోలుకున్నారు.
  • పంజాబ్​లో తాజాగా 320 మందికి వైరస్ సోకగా.. 9 మంది చనిపోయారు.

ఇదీ చూడండి: అంబులెన్స్‌లో గుండె- 12నిమిషాల్లో 18కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.