ETV Bharat / bharat

అయ్యో పాపం.. తాగునీరు లేక చిన్నారి మృతి - jalore news

రాజస్థాన్​లో తాగునీరు అందక ఓ ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది. ఘటనా స్థలానికి పరుగులు తీసిన అధికారులు.. వృద్ధురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

5 year old child died due to lack of water
తాగునీరు అందక చిన్నారి మృతి
author img

By

Published : Jun 8, 2021, 2:33 PM IST

రాజస్థాన్​లో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఎండలో నడుస్తూ, తాగేందుకు నీరు దొరకక ఓ ఐదేళ్ల చిన్నారి మరణించింది. ఆమె పక్కనే ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది.

5 year old child died due to lack of water in jalore Rajasthan
చనిపోయిన చిన్నారి.. పక్కనే వృద్ధురాలు

ఇదీ జరిగింది..

రాయ్​పుర్​ నుంచి రాణివాడా తాలూకాలోని రోడా గ్రామానికి ఐదేళ్ల చిన్నారితో బయలుదేరింది సుకి దేవి భిల్​. ఎండలు ఎక్కువగా ఉండటం, తాగడానికి నీరు కూడా లేకపోవడం వల్ల వారు ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

వృద్ధురాలికి నీరు అందిస్తూ..

స్థానికులు ఈ సమాచారాన్ని సర్పంచ్​ కృష్ణ రాజ్​పురోహిత్​కు అందించారు. ఆయన.. రాణివాడా పోలీసులతో కలిసి ఘటనాస్థలానికి పరుగులు తీశారు. తక్షణమే వైద్య సిబ్బందిని పిలిపించారు. అనంతరం ఆ వృద్ధురాలిని కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు తరలించారు. ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

చిన్నారి మరణంపై కాంగ్రెస్​ ప్రభుత్వం, సీనియర్​ నేత రాహుల్​ గాంధీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ఇది ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు.

PRAKASH JAVADEKAR
ప్రకాశ్​ జావడేకర్​ ట్వీట్​
RAJYAVARDHAN
రాజ్యవర్ధన్​ సింగ్​ రాఠోడ్​ ట్వీట్​

ఇవీ చూడండి: ఆసుపత్రి 'ఆక్సిజన్​ డ్రిల్​'- రోగుల ప్రాణాలతో చెలగాటం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.