Digital Campaign five state elections: హోరెత్తించే మైకులు, ర్యాలీలు, పోటాపోటీగా సభలు.. భారీగా జనసమీకరణలు.. సభల్లో పంచ్ డైలాగ్‌లు.. ఆకట్టుకునే పాటలు.. వ్యంగ్యాస్త్రాలు.. ఛలోక్తులు.. ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా.. ప్రచారంలో ఇవి సర్వసాధారణం. అయితే ఇది కరోనా రాక ముందు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎన్నికల ప్రచార శైలి మారిపోయింది.
వచ్చే నెల జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఫలితంగా ప్రత్యక్ష ప్రచారానికి అవకాశం లేకుండాపోయింది. దీంతో రాజకీయ పార్టీలు డిజిటల్, వర్చువల్ ప్రచారాలపైనే దృష్టి సారిస్తున్నాయి. ఇందుకోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాలను వినివియోగించుకుంటున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని.. పంచ్ డైలాగ్‌లు, ఆకట్టుకునే పాటలు, వ్యంగ్యాస్త్రాలు, ఛలోక్తులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రచారంలో తమదైన శైలిలో దూసుకుపోతున్నాయి.
మోదీ, యోగి పంచ్ డైలాగ్స్‌తో సాంగ్.
-
So the #ManikeMageHithe song seems to have been plagiarised into the @BJP4India song for #UttarPradeshElection2022 pic.twitter.com/wNnHYBfJU5
— Ninjamonkey 🇮🇳 (@Aryan_warlord) January 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">So the #ManikeMageHithe song seems to have been plagiarised into the @BJP4India song for #UttarPradeshElection2022 pic.twitter.com/wNnHYBfJU5
— Ninjamonkey 🇮🇳 (@Aryan_warlord) January 17, 2022So the #ManikeMageHithe song seems to have been plagiarised into the @BJP4India song for #UttarPradeshElection2022 pic.twitter.com/wNnHYBfJU5
— Ninjamonkey 🇮🇳 (@Aryan_warlord) January 17, 2022
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఓ ప్రచారగీతాన్ని విడుదల చేసింది. శ్రీలంకలో ఎంతో పాపులరైన పాటకు పేరడీగా.. భాజపా తన ప్రచార గీతాన్ని ఆవిష్కరించింది. అందరి మనసులో ఒకటే ఉంది. రెండు ఆశలు....అదే మోదీ, యోగి.. వారివల్ల ఎంతో ఉపయోగం.. ఇలా ఆ పాట సాగుతుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, చేసిన సంక్షేమం, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాలను ప్రచార గీతంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ప్రచార గీతానికి భాజపా నేతలు విస్తృతంగా ప్రాచుర్యం కల్పించారు. ఈ పాటలో మధ్యమధ్యలో జోడించిన ప్రధాని మోదీ, సీఎం యోగి పంచ్ డైలాగ్‌లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
సమాజ్‌వాదీ పార్టీ పాటకు సూపర్ రెస్పాన్స్.
-
Beyondust Digital Studio @Beyonduststudio is presenting @yadavakhilesh in & as #AY22
— Anant Vaibhav (@AnantVaibhav_) January 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
"बाईस में बदलाव होकर रहेगा - That Promise Will be Kept" pic.twitter.com/uGIouTz2mJ
">Beyondust Digital Studio @Beyonduststudio is presenting @yadavakhilesh in & as #AY22
— Anant Vaibhav (@AnantVaibhav_) January 11, 2022
"बाईस में बदलाव होकर रहेगा - That Promise Will be Kept" pic.twitter.com/uGIouTz2mJBeyondust Digital Studio @Beyonduststudio is presenting @yadavakhilesh in & as #AY22
— Anant Vaibhav (@AnantVaibhav_) January 11, 2022
"बाईस में बदलाव होकर रहेगा - That Promise Will be Kept" pic.twitter.com/uGIouTz2mJ
యూపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ కూడా డిజిటల్ ప్రచారంలో దూసుకుపోతోంది. భాజపా నాయకత్వంపై దూకుడుగా వ్యవహరిస్తోంది. భాజపా అగ్రశ్రేణి నాయకులపై పంచ్ డైలాగ్‌లతో తమదైన ప్రచార వ్యూహంతో ముందుకెళ్తోంది ఎస్పీ. ఈ ఎన్నికల్లో భాజపాను ఒడించాలని అర్థం వచ్చేలా అవధ్ మాండలికంలో రూపొందించిన ప్రచార గీతం మంచి ఆదరణ పొందింది.
కొంకణి భాషలో తృణమూల్ పాట..
గోవాలో తొలిసారి ఎన్నికల బరిలో దిగిన తృణమూల్ కాంగ్రెస్ కూడా ప్రచారం కోసం కొంకణి భాషలో ఓ పాటను రూపొందించింది. టీఎంసీ ఎన్నికల గుర్తును ప్రతిబింబించేలా ఈ పాట ఉంటుంది. రెండు పువ్వుల యుగం వచ్చిందని, గోవాలో కొత్త అధ్యాయం మొదలుకానుందనే అర్థంవచ్చేలా ప్రచార గీతాన్ని రూపొందించారు.
సిక్కుల ఇలాఖాలో గెలుపు కోసం..
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీ తర్వాత అందరూ ఆసక్తిగా చూస్తున్న రాష్ట్రం పంజాబ్. సిక్కుల ఇలాఖాలో ఈసారి గెలిచి అధికారం చేపట్టాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీపార్టీ.. డిజిటల్ ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ లక్ష్యంగానే ఆరోపణలు గుప్పిస్తోంది. అమరీందర్ సింగ్ తర్వాత అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయన ఇచ్చిన ఎన్నికల వరాలపై ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. వాగ్దానాల సీఎం అనే అర్థం వచ్చేలా ఛలోక్తులు విసురుతోంది.
కాంగ్రెస్ కూడా అదే రీతిలో చీపురు పార్టీ విమర్శలకు గట్టిగా బదులిస్తోంది. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రచారకర్త మాత్రమే అనే అర్థం వచ్చేలా 'విగ్యాపన్ భాయ్' అంటూ ప్రచారంలో వ్యంగ్యాస్త్రాలు విసురుతోంది. ఉత్తుత్తి వాగ్దానాలు చేయటమే కేజ్రీవాల్‌కు తెలుసు.. కానీ చన్నీ అలా కాదంటూ ఆప్ ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పికొడుతోంది.
పంజాబ్‌లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన మాజీ సీఎం అమరీందర్ సింగ్.. తన పార్టీ గుర్తు అయిన హాకీ స్టిక్ బాల్‌తో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గోల్స్ చేయటమే తరువాయి అనే హ్యాష్ ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అదరగొడుతున్నారు.
ఉత్తరాఖండ్‌లో పోటాపోటీగా..
ఉత్తరాఖండ్‌లో ఈసారి అధికారంలోకి రావాలని పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ.. భాజపా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఓ వీడియో క్లిప్ విడుదల చేసింది. విశ్రాంత సైనికులు ఇంకా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ప్రయోజనాలు పొందలేదని ప్రచారం చేస్తోంది. పాపులర్ ఆన్‌లైన్ పోర్టల్ ప్రకటనకు పేరడీగా ఓ వీడియో రూపొందించింది. అయితే భాజపా కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొడుతోంది.
సైనికులకు అందాల్సినవి తాము అందించినట్లు కమలంపార్టీ ప్రచారం చేస్తోంది. దేశంలోనే అతి పెద్ద అసత్యాల పార్టీ అబద్ధాలను సైనికులు బట్టబయలు చేశారని, వాటిని చూద్దామంటూ కమలనాథులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసినందుకు ప్రధాని మోదీకి విశ్రాంత సైనికులు కృతజ్ఞతలు తెలిపే వీడియో ద్వారా భాజపా.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది. 2017లో భాజపా అధికారం చేపట్టేందుకు కారణమైన అనేక కీలకాంశాల్లో వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఒకటి. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం గానా భజానాలను తలదన్నేలా సాగుతోంది.
ఇదీ చూడండి: Election 2022 India: ఎన్నికల గోదాలో గెలిచేదెవరో?