ETV Bharat / bharat

ఇన్నోవా ఢీకొని ఐదుగురు విద్యార్థులు మృతి

రాజస్థాన్​లోని జాలోర్​ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ఇన్నోవా కారు ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

5-school-children-died-after-being-hit-by-car-in-jalore
ఇన్నోవా ఢీకొని ఐదుగురు విద్యార్థులు మృతి
author img

By

Published : Mar 24, 2021, 7:37 PM IST

Updated : Mar 24, 2021, 7:52 PM IST

రాజస్థాన్​లోని జాలోర్​ జిల్లా కరడా గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వస్తున్న కారు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ఢీ కొట్టడం వల్ల ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతులలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ జరిగింది..

కరడా-రాణీవాడా రోడ్డు మార్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చిన ఆరుగురు విద్యార్థులు రోడ్డు మార్గంలో నడుస్తున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న ఓ ఇన్నోవా కారు అదుపు తప్పి వీరిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చదవండి : శబరిమల కోసం ప్రత్యేక చట్టం: భాజపా హామీ

Last Updated : Mar 24, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.