ETV Bharat / bharat

కుటుంబం మొత్తాన్ని హత్య చేసి.. ఇంటికి నిప్పు పెట్టి.. - 4 people murdered in prayagraj

ఉత్తర్​ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. చనిపోయిన వారిలో దివ్యాంగురాలు సహా ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు.

5-people-murdered-in-prayagraj
కుటుంబం మొత్తాన్ని హత్య చేసి.. ఇంటికి నిప్పు పెట్టి..
author img

By

Published : Apr 23, 2022, 11:27 AM IST

ఉత్తర్​ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని సంగం నగరంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఇందులో ఓ చిన్నారి, దివ్యాంగురాలు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

అసలేమైంది?: తర్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని గారాపూర్ నుంచి సికంద్రా వెళ్లే రోడ్డు పక్కన రాజ్‌కుమార్ యాదవ్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కుటుంబ సభ్యులందరినీ హత్య చేశారు. రాజ్‌కుమార్ యాదవ్, అతని భార్య కుసుమ్ దేవి, కోడలు సవిత, దివ్యాంగురాలైన కుమార్తె మనీషా, మనవరాలు సాక్షిని దారుణంగా చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అందరినీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు.. అందరూ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.

murder
వివరాలు సేకరిస్తున్న పోలీసులు
murder
స్థానికులతో మాట్లాడుతున్న పోలీసులు

మనీషా దివ్యాంగురాలు కాగా.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు.. ఆమె బట్టలు చిందరవందరగా ఉన్నాయి, దీని కారణంగా ఆమె హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి: బైక్​ను వేగంగా ఢీకొట్టిన కారు.. గాల్లో పల్టీలు కొట్టిన రైడర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.