ETV Bharat / bharat

'గ్యాంగ్​ రేప్'​ ముఠా అరెస్ట్​.. హైవేపై వెళ్లే భార్యాభర్తలే వారి లక్ష్యం! - రాజస్థాన్​

చీకటిగా ఉండే రహదారిని ఎంచుకుని.. అటుగా వెళ్తున్న భర్యాభర్తలపై దాడి చేసి, మహిళపై సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్న ముఠాను రాజస్థాన్​, ప్రతాప్​గఢ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ప్రతి 10-15 రోజులకు ఓసారి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుసుకొని షాక్​ అయ్యారు. వారి నుంచి 6 వీడియోలు స్వాధీనం చేసుకున్నారు.

gang-rapes
'గ్యాంగ్​ రేప్'​ ముఠా అరెస్ట్​
author img

By

Published : Jan 19, 2022, 10:29 PM IST

హైవేలపై వెళ్లే భార్యాభర్తలే వారి లక్ష్యం. నిర్మానుష్యంగా, చికటిమయంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని వారిపై దాడి చేసి.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రతి 15 రోజులకు ఓ చోట ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుసుకుని పోలీసులే నిర్ఘాంతపోయారు. ఈ ఘటన రాజస్థాన్​లోని ప్రతాప్​గఢ్​ జిల్లాలో జరిగింది. ఈ ముఠాకు చెందిన ఐదుగురుని పట్టుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడినట్లు చెప్పారు పోలీసులు. అరెస్టయిన వారి నుంచి గ్యాంగ్​ రేప్​లకు సంబంధించిన ఆరు వీడియోలను స్వాధీనం చేసుకున్నారు.

" ప్రతి 10-15 రోజులకు ఓసారి చీకటిగా ఉండే రహదారులను ఎంచుకుని నేరాలకు పాల్పడుతున్నారు. వీడియోల ఆధారంగా వారు సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ గ్యాంగ్​లో 8 మంది ఉన్నారు. అందులో ఎక్కువ మంది 20 ఏళ్లలోపు వారే. వారు కిడ్నాప్​లు, దోపిడీలకు సైతం పాల్పడుతున్నారు. అరెస్టయిన ఐదుగురిలో ఒకరు మైనర్​. పలువురు బాలికలపై గ్యాంగ్​ రేప్​కు పాల్పడిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ గిరిజన బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ తీసిన వీడియో సైతం అందులో ఉంది. ఈ కేసులో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నాం."

- అమ్రిత్​ దుహాన్​, ప్రతాప్​గఢ్​ ఎస్పీ.

ఓ పెట్రోల్​ పంప్​లో దోపిడి చేయాలని ప్రణాళిక వేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు నగరంలోని ఓ పాడుబడిన ఇంటిపై దాడి చేశారు పోలీసులు. పోలీసుల రాకను గమనించిన ముగ్గురు పరారవగా.. మిగిలిన ఐదుగురిని అరెస్ట్​ చేశారు. వీరి నుంచి కారంపొడి, ఇనుప రాడ్లు, రెండు లాఠీలు, ఓ ఖడ్గం, కత్తి, నైలాన్​ తాడు, రెండు మోటర్​ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

అరెస్టయిన నిందితులు పుస్కర్​ కీర్​, పలియా మీనా, ఇద్దరు దీపక్​లు సహా ఓ మైనర్​ని గుర్తించారు. ఈ ముఠాలోని ఎనిమిది మందికి క్రిమినల్​ చరిత్ర ఉన్నట్లు చెప్పారు పోలీసులు. 'జిల్లాలోని ధరియావాడ్​లో కూరగాయల విక్రయం సహా చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసలై 10-15 రోజులకు ఓసారి గ్యాంగ్​ రేప్​ ప్రణాళిక చేస్తున్నారు. రోడ్డుపై బైక్​లను పార్క్​ చేసి తమ టార్గెట్ల కోసం వేచి చూస్తారు. ముఖ్యంగా భార్యాభర్తలను లక్ష్యంగా చేసుకుంటారు' అని పోలీసులు తెలిపారు. భార్యాభర్తలు కనిపిస్తే.. భర్తపై దాడి చేసి.. అతని భార్యను అపహరించి అత్యాచారానికి పాల్పడతారని చెప్పారు. వీడియోలు తీసి ఎవరికైనా చెబితే వైరల్​ చేస్తామని బెదిరిస్తారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 16 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా తండ్రి, అన్న లైంగిక దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.