ETV Bharat / bharat

'సారీ తమ్ముడూ!'.. 434 మీటర్ల లేఖ రాసిన అక్క.. ఎందుకంటే... - sister letter to brother

ఫోన్ చేయలేదని హర్ట్ అయిన తమ్ముడికి సారీ చెప్పేందుకు విచిత్ర ప్రయత్నం చేసింది ఓ యువతి. ఏకంగా 434 మీటర్లు పొడవు, 5 కిలోల బరువున్న పేపర్​తో లేఖ రాసింది. ఇంతకీ.. ఆ లేఖలో ఏముంది? అసలు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ లేఖతో ఆ తమ్ముడి మనసు కరిగిందా?

SISTER-BROTHER-LETTER
SISTER-BROTHER-LETTERSISTER-BROTHER-LETTER
author img

By

Published : Jun 29, 2022, 2:23 PM IST

Updated : Jun 29, 2022, 2:55 PM IST

అది మే 24 2022.. కృష్ణ ప్రసాద్(21).. ఉదయం లేచినప్పటి నుంచి పదేపదే మొబైల్ ఫోన్ వైపే చూస్తున్నాడు. ఏదైనా కాల్​ లేదా మెసేజ్ వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇక ఓపిక పట్టలేక.. తానే ఒకరికి కాల్​ చేశాడు. కానీ.. అటు వైపు నుంచి సరిగా స్పందన లేదు. దీంతో బాగా హర్ట్ అయ్యాడు. రోజంతా ఎంతో బాధపడ్డాడు. సాయంత్రానికి ఆ బాధ కాస్తా కోపంగా మారింది. అవతలి వ్యక్తి కాల్ చేసినా ఆన్సర్ చేయలేదు. వాట్సాప్​లో ఆ నంబర్​ను బ్లాక్ చేసేశాడు కృష్ణ ప్రసాద్.

కృష్ణ ప్రసాద్​ది.. కేరళలోని ఇడుక్కి. ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతడిని ఇంతలా బాధపెట్టిన వ్యక్తి.. అక్క కృష్ణప్రియ(28). మే 24న బ్రదర్స్​ డే అయినా.. ఆమె తనకు శుభాకాంక్షలు చెప్పలేదన్నదే అతడి ఆవేదన. ఇంజినీర్​గా పనిచేస్తున్న కృష్ణ ప్రియకు విషయం ఆలస్యంగా అర్థమైంది. తప్పును సరిదిద్దుకుంటూ.. తమ్ముడంటే ఎంత ప్రేమో తెలియచేయాలని అనుకుంది. అందుకోసం ఏం చేసిందో ఆమె మాటల్లోనే...

"బ్రదర్స్​ డే విషెస్ చెప్పడం మర్చిపోయా. అందుకే తమ్ముడు నాతో ఫోన్​లో మాట్లాడడం మానేశాడు. వాట్సాప్​లో నా నంబర్ బ్లాక్ చేశాడు. అందుకే లేఖ రాయాలని అనుకున్నా. A4 సైజ్​ షీట్స్​పై రాయడం మొదలుపెట్టా. కానీ.. తమ్ముడికి నేను చెప్పాలని అనుకున్న విషయం రాసేందుకు ఇవి సరిపోవని అర్థమైంది. అందుకే ఇంకా పొడవైన పేపర్లు కొనాలని అనుకున్నా. మార్కెట్​కు వెళ్లి అడిగితే.. అలాంటివి ఉండవన్నారు. బిల్లింగ్ రోల్స్​ మాత్రమే ఉంటాయని చెప్పారు. 14 బిల్లింగ్ రోల్స్​ కొని ఇంటికి తెచ్చా. మొత్తం లేఖ రాసేందుకు 12 గంటలు పట్టింది. చివరకు ఆ లేఖ 434 మీటర్లు పొడవు, 5 కేజీల బరువు ఉంది." అంటూ తన భారీ లేఖ విశేషాలు చెప్పింది కృష్ణ ప్రియ.

లేఖలో ఏముంది?: "కృష్ణ ప్రసాద్​ జీవితం గురించి మొత్తం వివరాలు ఈ లేఖలో రాశా. వాడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఇంజినీరింగ్ విద్యార్థిగా ఉన్న నాటి వరకు సంగతులు, మేం కలిసి గడిపిన క్షణాలు, మా మధ్య ప్రేమ.. ఇలా ప్రతి విషయం ప్రస్తావించా. తమ్ముడు(కృష్ణప్రసాద్)నాకన్నా ఏడేళ్లు చిన్నవాడు. వాడికి నేనంటే గౌరవం. నన్ను ఒక తల్లిలా, టీచర్​లా చూసి.. కాస్త భయపడుతుంటాడు. మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. చాలా స్నేహపూర్వకంగా, కవలల్లా ఉండేవాళ్లం. ఏదైనా పండుగ అయితే.. ఒకే రంగు దుస్తులు ధరించేవాళ్లం" అని తమ్ముడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని మురిసిపోయింది కృష్ణ ప్రియ.

లేఖ పనిచేసిందా?: కృష్ణ ప్రియ శ్రమ వృథాపోలేదు. ఆమె లేఖాస్త్రం వెంటనే పని చేసింది. అనేక రోజులుగా బాధతో, కోపంతో ఉన్న తమ్ముడి మోముపై చిరునవ్వు చిందేలా చేసింది. అక్కాతమ్ముళ్లు మళ్లీ ఒక్కటయ్యారు.
"బ్రదర్స్​ డే శుభాకాంక్షలు చెప్పలేదని నేను చాలా బాధపడ్డా. ఆ రోజు నేను ఆమెకు కాల్ చేసినా.. పనిలో బిజీగా ఉన్నానని ఎక్కువ సేపు మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమెను వాట్సాప్​లో బ్లాక్ చేశా. ఏం జరిగిందో ఆమె అర్థం చేసుకుని.. బాధపడినట్టుంది. అందుకే ఈ లేఖ రాసింది. ఈ లేఖ అందాక నాకు చాలా సంతోషం కలిగింది" అని నవ్వుతూ చెప్పాడు కృష్ణ ప్రసాద్.

అక్కాతమ్ముళ్ల ప్రేమకు ప్రతీకగా నిలిచిన ఈ భారీ లేఖకు.. ప్రపంచంలోనే అతిపొడవైన లేఖగా గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కే అవకాశముంది. ఇందుకోసం ఇప్పటికే గిన్నిస్ బుక్​ వారికి దరఖాస్తు పంపింది కృష్ణప్రియ. వాళ్లు అన్నీ పరిశీలించి, ఆమోద ముద్ర వేయడమే తరువాయి.

ఇవీ చదవండి: కన్హయ్య హత్య వెనుక 'అంతర్జాతీయ కుట్ర'!.. ఎన్​ఐఏ ఎంట్రీ.. ఉదయ్‌పుర్‌లో హైఅలర్ట్​

'మహా' సంక్షోభం: గవర్నర్‌ ఆదేశాలను సవాల్​ చేస్తూ.. సుప్రీంకు శివసేన

Last Updated : Jun 29, 2022, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.