మహారాష్ట్ర లాతూర్ నగరం ఎమ్ఐడీసీ ప్రాంతంలోని ఓ హస్టల్లో దాదాపు 40 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. హాస్టల్లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా వారికీ పరీక్షలు చేయించారు హాస్టల్ నిర్వాహకులు.
మహారాష్ట్రలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అప్రమత్తమైన మహా సర్కార్.. నిబంధనలను కఠినతరం చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న నగరాల్లో ఆంక్షలు విధించింది.
ఇదీ చదవండి : ఆ రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా.. మళ్లీ లాక్డౌన్!