ETV Bharat / bharat

దివ్యాంగులైన కుమార్తెలే తండ్రికి 'ఆ నలుగురై' - ఒడిశా బాలసోర్​ వార్తలు

దివ్యాంగులైన నలుగురు మహిళలు అనారోగ్యంతో మృతిచెందిన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి మృతితో వీరికి జీవనాధారం కోల్పోయినట్లు అయింది. ఈ హృదయ విదారక ఘటన ఒడిశాలో జరిగింది.

odisha news latest
దివ్యాంగులైన కుమార్తెలే ఆ నలుగురై
author img

By

Published : Oct 18, 2021, 1:57 PM IST

తండ్రికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుమార్తెలు

ఒడిశాలోని బాలేశ్వర్​​ జిల్లా దుముడా గ్రామంలో ఆదివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మృతిచెందిన తండ్రికి కొడుకులు లేకపోవడం వల్ల దివ్యాంగులైన నలుగురు కుమార్తెలే పాడి మోసి.. అంత్యక్రియలు నిర్వహించారు.

నిజాంపుర్​ పంచాయత్​ దుముడా గ్రామానికి చెందిన బైధార్​ జేనా నలుగురు కుమార్తెలకు వినికిడి లోపం ఉంది. ఈ కారణంగా వారికి వివాహం కూడా జరగలేదు. తండ్రి ఆధారంతోనే వారు జీవనం సాగిస్తున్నారు. గతకొంత కాలంగా బైధార్​ అనారోగ్యంతో బాధపడుతుండటం వల్ల అతని భార్య హర్మానీ జేనా కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకుంది. కానీ ఆరునెలల క్రితమే ఆమె మృతిచెందింది.

ఇప్పుడు తండ్రి కూడా మృతిచెందడం వల్ల కుమార్తెలకు ఉన్న ఒక్క ఆధారం కూడా కోల్పోయినట్లు అయింది.

ఇదీ చూడండి : ఎక్స్​ప్రెస్​వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.