ఒడిశా కటక్‌లో విషాదం చోటుచేసుకుంది. మహానదిలో (Mahanadi news today) స్నానానికి వెళ్లి.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థి ఆచూకీ గల్లంతైంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మృతుల్ని కటక్‌లోని పోటాపొఖారి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను ఎస్సీబీ వైద్య కళాశాలకు తరలించారు.
ఇదీ జరిగింది..
8వ తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. స్నానం చేసేందుకు ఉడిములా ఘాట్‌కు చేరుకున్నారు.
ఎంతసేపైనా తిరిగి ఇంటికి రాకపోగా.. కుటుంబ సభ్యులు నది దగ్గరకు వెళ్లారు. అక్కడే ఒడ్డున సైకిళ్లు, దుస్తులు ఉండటం చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ఒడిశా(Odisha news) విపత్తు ప్రతిస్పందన దళం(ఓడీఆర్ఎఫ్) సిబ్బంది.. విద్యార్థుల మృతదేహాలను బయటకుతీశారు. మరో విద్యార్థి కోసం గాలిస్తున్నారు.
విద్యార్థుల మరణంతో.. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇదీ చూడండి: Constitution Day 2021: 'ఆయన స్ఫూర్తి దేశానికి మార్గదర్శకం'