ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందిపూర్ ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌లో (DRDO) పనిచేస్తున్న ఐదుగురు తాత్కాలిక సిబ్బందిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను (Indian defence secrets) విదేశీ సంస్థలకు ఫోన్‌లో సమాచారం అందిస్తున్నట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
వీరు తరచూ విదేశాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేయడాన్ని గుర్తించిన అధికారులు.. వారిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నారు.
ఇదే తరహా కేసులో ఇటీవల మరో వ్యక్తిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. డీఆర్‌డీఓలో (DRDO) ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన ఈశ్వర బెహరా.. రక్షణ విభాగానికి చెందిన రహస్యాలను పాకిస్థాన్‌కు అందించిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: వ్యాక్సినేషన్ ప్రక్రియలో.. సాధించాల్సింది మరెంతో!