దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. శనివారం సాయంత్రం 7 గంటల వరకు 4,36,75,564 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజే.. 16,12,172 టీకా డోసులు అందించినట్లు చెప్పింది.
మరోవైపు దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా 40,953 కొత్త కేసులు వెలుగుచూశాయి. 188 మంది వైరస్‌కు బలయ్యారు.
మహారాష్ట్రలో అత్యధికం..
మహారాష్ట్రలో శనివారం 27,126 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. తాజాగా వైరస్ ధాటికి మరో 92 మంది ప్రాణాలు కోల్పోయారు.
పుణేలో 3,200, ముంబయిలో 2,982, నాగ్‌పుర్‌లో 2,873 కరోనా కేసులు వెలుగు చూశాయి.
- కొత్త కేసులు: 27,126
- మొత్తం బాధితులు: 24,49,147కు
- మొత్తం మరణాలు: 53,300
దిల్లో 800కు పైగా..
దిల్లీలో కొత్తగా 800కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరంలో నమోదయిన కేసుల్లో ఇవే అత్యధికం. వైరస్ బారినపడి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
- కొత్త కేసులు:813
- మొత్తం బాధితులు: 6,47,161
- మొత్తం మరణాలు: 10,955
ఇదీ చూడండి: కొవిడ్ ఉద్ధృతి.. 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు!
ఇదీ చూడండి: కరోనా విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ