దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో పనిచేసే 37 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని గురువారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం డాక్టర్లు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపాయి.
దిల్లీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే 7,437 మందికి పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. మరో 24 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి:బైక్ కొంటే హెల్మెట్ ఉచితం