ETV Bharat / bharat

పాఠశాలలో 35 మంది విద్యార్థులకు కరోనా

హరియాణాలోని ఓ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో 35 మంది విద్యార్థులకు పాజిటివ్​గా తేలింది. దీంతో వారం రోజుల పాటు పాఠశాలను మూసివేశారు అధికారులు.

35-children-found-corona-positive-at-kharka-village-senior-secondary-school-kaithal
పాఠశాలలో కరోనా కలకలం.. 35మంది విద్యార్థులకు పాజిటివ్​
author img

By

Published : Mar 9, 2021, 8:42 AM IST

సర్కార్ ఆదేశాలతో హరియాణాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఇటీవలే పునఃప్రారంభించారు. అయితే విద్యార్థులపై కరోనా ప్రభావం పడుతుండటం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. కైథల్​ జిల్లా ఖర్కా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 35మందికి కరోనా పాజిటివ్​గా తేలింది.

మొదట ఈ స్కూల్​ టీచర్​ కరోనా బారినపడ్డారు. అనంతరం 150 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 23మందికి పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాత మరో 160మందికి పరీక్షలు చేయగా 12మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఇలా మొత్తం 35మందికి వైరస్​ సోకింది. దీంతో పాఠశాలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు

కరోనా కేసుల నేపథ్యంలో జిలాల్లోని మిగతా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించినట్లు కైథల్​ సీఎంఓ ఓం ప్రకాశ్​ తెలిపారు. అన్ని చోట్ల విద్యార్థులు కరోనా నిబంధనలు కఠినంగా పాటిస్తున్నట్లు చెప్పారు.

పాఠశాలకు వచ్చే విద్యార్థులందరీ ప్రవేశద్వారంలో థర్మల్​ స్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్​ విమలా దేవి తెలిపారు. తరచూ శానిటైజ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తల్లిదండ్రుల అంగీకార పత్రంతోనే విద్యార్థులను అనుమతిస్తునట్లు పేర్కొన్నారు. విద్యార్థులను పాఠశాలలకు పంపాలని వినతి చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇదీ చూడండి: 'త్రివిధ దళాల్లో 42 వేల మందికి కరోనా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.