జమ్ము కశ్మీర్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలోని కనిగాం ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారని జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు.
బలగాలు.. పక్కా సమాచారం అందుకొని అల్-బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురిని చుట్టుముట్టాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది లొంగిపోగా... మిగిలిన వారు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.