ETV Bharat / bharat

ఉత్తరాల పంపిణీకి పోస్ట్​ఉమన్ ఎగనామం- ఇంట్లో సంచులకొద్దీ... - హిమాచల్​ ప్రదేశ్​ సర్కాఘాట్​ మండల్

ప్రియుడితో కలిసి భర్త ఆత్మహత్యకు కారణమైన ఓ మహిళను అరెస్టు చేసిన పోలీసులు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. ఇంటింటికీ తిరిగి ఉత్తరాలు పంచాల్సిన ఆ పోస్ట్​ఉమన్ గత మూడు సంవత్సరాలుగా వాటిని చేరవేయట్లేదని గుర్తించారు. మహిళను అరెస్టు చేసి, ఆ సంచులను స్వాధీనం చేసుకున్నారు.

lady postman
lady postman
author img

By

Published : Oct 5, 2021, 3:05 PM IST

మూడేళ్లుగా పంపిణీ చేయని ఉత్తరాల సంచులు

భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఓ మహిళను అరెస్టు చేసేందుకు వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ మండి జిల్లా పోలీసులు మరో విచిత్ర ఘటన గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. పోస్ట్ఉమన్ అయిన ఓ మహిళ.. మూడేళ్లుగా ఉత్తరాలను పంపిణీ చేయట్లేదని గుర్తించారు. ఆమె ఇంటి నుంచి మూడు బస్తాల ఉత్తరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వెయ్యికిపైగా ఆధార్ కార్డులు, రెండున్నర వేలకు పైగా స్పీడ్ పోస్ట్ లెటర్లు, ఇంటర్వ్యూ కాల్ లెటర్లు, ఎల్​ఐసీ రశీదులు, చెక్కు బుక్కులు, విద్యార్థుల సర్టిఫికేట్లు ఉన్నాయి. వాటిలో చాలావరకు దెబ్బతిన్నాయి కూడా.

lady postman
కిలేడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఉత్తరాల సంచులు
lady postman
పోస్ట్​ ఉమన్​పై ఫిర్యాదు చేస్తున్న బంధువులు

ఇదీ జరిగింది..

సర్కాఘాట్ మండలం నవాహిలో నివసిస్తున్న ఉషా దేవి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పోస్ట్‌ఉమెన్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త గత వారం విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం తన భార్య, ఆమె ప్రేయసి, అత్తమామలేనని సూసైడ్ నోట్​లో పేర్కొన్నాడు. మృతుడి సోదరుడు సంజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు.. ​సర్కాఘాట్ పోలీసులు ఉషాదేవితో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు.

విలువైన డాక్యుమెంట్లు..

విచారణలో భాగంగా ఆధారాల కోసం మహిళ ఇంట్లో వెదుకుతున్న పోలీసులకు ఓ గదిలో మూడు బస్తాల నిండా ఉత్తరాలు లభ్యమయ్యాయి. ఎంతో విలువైన ఈ డాక్యుమెంట్లను గత మూడేళ్లుగా పంపిణీ చేయట్లేదని తెలిసి పోలీసులు, అధికారులు అవాక్కయ్యారు.

సస్పెండ్​..!

మరోవైపు ఉత్తరాలు పంచకుండా పెద్దఎత్తున తనవద్దే ఉంచిన మహిళా ఉద్యోగిని సస్పెండ్ చేసింది తపాలా శాఖ. అంతేగాక ఈ ఘటనపై విచారణను ప్రారంభించినట్లు ప్రకటించింది. విచారణ పూర్తయితే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.