ETV Bharat / bharat

చదువంటే ఇంట్రెస్ట్​ లేదని ఇళ్ల నుంచి పరార్​.. చివరకు..

చదువంటే తమకు ఆసక్తి లేదని.. క్రీడల్లో రాణించాకే తిరిగొస్తామంటూ బెంగళూరుకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఇళ్ల నుంచి పరారయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురి ఆచూకీ కనుగొన్నారు.

karnataka bengaluru news
చదువంటే ఇంట్రెస్ట్​ లేదని ఇళ్ల నుంచి జంప్​.. చివరకు..
author img

By

Published : Oct 11, 2021, 7:28 PM IST

కర్ణాటకలోని బెంగళూరులో రెండు వేర్వేరు చోట్ల ఏడుగురు విద్యార్థులు అదృశ్యమైనట్టు​ కేసు నమోదైంది. బగలకుంటే పోలీస్​ స్టేషన్​లో పరిధిలో ముగ్గురి ఆచూకీ గల్లంతు అవగా.. సోలాదేవనహళ్లి ఠాణా పరిధిలో మరో నలుగురు కనిపించకుండా పోయారు. ఈ విద్యార్థులు వారంతట వారే ఇళ్లు వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది.

అయితే బగులకుంటే ఠాణా పరిధిలో గల్లంతైన వారి ఆచూకీని పోలీసులు సోమవారం కనుగొన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

karnataka bengaluru news
బగులకుంటే ఠాణా పరిధిలో గల్లంతైన ముగ్గురు విద్యార్థులు
karnataka bengaluru news
సోలాదేవానహల్లి ఠాణా పరిధిలో ఇళ్ల నుంచి వెళ్లిపోయిన నలుగురు విద్యార్థులు

కారణం ఒక్కటే..

బగులకుంటే ఠాణా పరిధిలోని శేషాద్రి లే అవుట్​కు చెందిన పరీక్షిత్​, నందన్​, కిరణ్​ అనే ముగ్గురు విద్యార్థులు సౌందర్య స్కూల్​లో పదో తరగతి చదువుతున్నారు. ఈ ముగ్గురికీ చదువు పట్ల ఆసక్తి లేని కారణంగా ఇంటి నుంచి పారిపోదామని నిశ్చయించుకున్నారు. శనివారం ఉదయం జాగింగ్​ అని వెళ్లి కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ ముగ్గురి ఇళ్లల్లో లేఖలను గుర్తించారు. తమకు చదువంటే ఇష్టం లేదని, క్రీడల పట్ల తమకు ఆసక్తి ఉందని.. ఏదో ఒక క్రీడలో రాణించాకే ఇంటికి తిరిగి వస్తామని లేఖలో పేర్కొన్నారు.

ఎటు వెళ్లాలో తెలియక..

క్రీడల్లో రాణించేందుకు ఇంటి నుంచి బయలుదేరిన పరీక్షిత్​, నందన్​, కిరణ్​.. మంగళూరుకు వెళ్దామనుకున్నారు. కానీ వారి వద్ద అంత డబ్బు లేదు. ఇద్దరి వద్ద రూ.800 ఉంటే మరొకరి వద్ద రూ.200 ఉన్నాయి. దీంతో కొంత దూరం బస్సు, ఆ తర్వాత రైలులో ప్రయాణించి మైసూరు చేరుకున్నారు. మైసూరులో శనివారం అర్ధరాత్రి వరకు తిరిగి, ఆదివారం ఉదయానికి మళ్లీ బెంగళూరుకు చేరుకున్నారు. విద్యార్థుల వైఖరిపై అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఆ నలుగురు కూడా అంతే..

మరోవైపు సోలాదేవనహళ్లి ఠాణా పరిధిలో నలుగురు విద్యార్థులు కూడా క్రీడల్లో రాణించి ఇంటికి వస్తామని లేఖ​ రాసి ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. వీరిలో ఓ 21 ఏళ్ల కాలేజీ విద్యార్థిని కూడా ఉంది. విద్యార్థులను ఏజీబీ లేఅవుట్​లోని క్రిస్టల్​ అపార్ట్​మెంట్​కు చెందిన అమృతవర్షిణి (21), భూమి (12), చింతన్ (12), రయాన్​ సిద్ధాంత (12)గా పోలీసులు గుర్తించారు.

విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ చూడండి : 25 వేల బిస్కెట్లు, కేకులతో అద్భుత కళాఖండం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.