దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తోంది. శుక్రవారం పలువురు ప్రముఖ నేతలు కరోనా బారినపడ్డారు.
ఇద్దరు కాంగ్రెస్ నేతలకు..
కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలాకు వైరస్ సోకింది. గత 5 రోజులుగా ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు టెస్టు చేసుకోవాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.
మరో కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌కు కొవిడ్ సోకింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని తన నివాసంలో హోం క్వారంటైన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
శిరోమణి అకాలీ దళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్‌కు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆమె క్వారెంటైన్లో ఉన్నట్లు ట్వీట్లో తెలిపారు.
30 మంది సాధువులకు
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కుంభమేళాలో పాల్గొన్న 30 మంది సాధువులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని హరిద్వార్ చీఫ్ మెడికల్ అధికారి స్పష్టం చేశారు.
"హరిద్వార్‌లో 30 మంది సాధువులకు పాజిటివ్‌గా తేలింది. అఖాడాల్లోలో వైద్య బృందాలు పర్యటిస్తూ సాధువులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి టెస్టుల నిర్వహణను మరింత వేగవంతం చేయనున్నారు."
--డా.ఎస్కే ఝా, చీఫ్ మెడికల్ ఆఫీసర్.
కొవిడ్ సోకిన వారిలో ఆరోగ్యం విషమంగా ఉన్నవారిని రిషికేశ్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు.
ఇదీ చదవండి:నైపుణ్యంతోనే భవితవ్యం- కార్యాచరణే కీలకం!