రాజస్థాన్లోని ఝుంఝును జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మట్టిదిబ్బల్లో ఆడుకుంటున్న నలుగురు చిన్నారుల్లో ముగ్గురు ప్రమాదవశాత్తు మరణించారు. గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
![3 innocent deaths due to soil subsidence in Nawalgarh of Jhunjhunu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-jjn-01-children-death-avbb-pkg-rjc10165_21032021050054_2103f_1616283054_708.jpg)
ఓ టన్నెల్ హౌస్ నిర్మిస్తున్న ప్రాంతంలో వీరంతా ఆడుకుంటున్నారు. ఒక్కసారిగా కింద ఉన్న మట్టి కూరుకుపోవడం వల్ల చిన్నారులు అందులో చిక్కుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
![3 innocent deaths due to soil subsidence in Nawalgarh of Jhunjhunu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rj-jjn-01-children-death-avbb-pkg-rjc10165_21032021050054_2103f_1616283054_484.jpg)
చిన్నారులు మట్టిలో గుంతలు తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరికి దూరంగా ఉన్న మరో బాలుడు ప్రమాదాన్ని గమనించి తల్లితండ్రులకు సమాచారం అందించాడు.
![3-innocent-deaths-due-to-soil-subsidence-in-nawalgarh-of-jhunjhunu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11094173_asdf.jpg)
ఇదీ చదవండి: కంబళ వీరుడు శ్రీనివాస గౌడ నయా రికార్డ్