ETV Bharat / bharat

5నెలల చిన్నారి తలలో 2కిలోల కణతి- అరుదైన ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 10:58 PM IST

2kg Lump In 5 Month Old Girl Head : రాజస్థాన్​కు చెందిన డాక్టర్లు ఓ అరుదైన ఆపరేషన్​ను నిర్వహించారు. 5నెలల వయసున్న ఓ చిన్నారి తలలో ఏర్పడిన 2 కిలోల కణతిని ఆపరేషన్​ ద్వారా విజయవతంగా తొలగించారు.

Doctors Removed 2kg Lump From 5 Year Old Girl In Rajasthan
Rajasthan Doctors Lump On Head

2kg Lump In 5 Month Old Girl Head : 5నెలల వయసున్న ఓ చిన్నారి తలలో ఏర్పడిన 2 కిలోల కణతిని ఆపరేషన్​ ద్వారా విజయవంతంగా తొలగించారు వైద్యులు. ఈ అరుదైన శస్త్రచికిత్సను రాజస్థాన్​ జైపుర్​లోని ఎస్​ఎంఎస్​ ఆస్పత్రికి చెందిన వైద్యులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.

'ఒక్క శరీరానికి రెండు తలల్లా'
పాప పుట్టినప్పటి నుంచే ఈ కణతి ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. అయితే మొదట్లో చిన్నగా ఉన్న దీని పరిమాణం, క్రమేణా పెరిగిందని వారు తెలిపారు. దీని ఆకారం చూస్తే ఒకే శరీరానికి రెండు తలలు ఉన్నాయా అన్నట్లుగా ఉండేదన్నారు. ఈ కణతి కారణంగా చిన్నారి తన శరీరాన్ని ఎక్కువగా కదిలించలేకపోయేదని, నిద్ర పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేదని ఆమె తల్లిదండ్రులు వివరించారు.

ఇదే విషయమై ఆందోళన చెందిన చిన్నారి కుటుంబం రాజస్థాన్​లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్‌ఎంఎస్‌ను ఆశ్రయించింది. చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆమెకు ఆపరేషన్​ తప్పనిసరని నిర్ణయించారు. ఆస్పత్రి సీనియర్​ ప్రొఫెసర్​, డాక్టర్​ సంజీవ్​ చోప్రా ఆధ్వర్యంలో చిన్నారికి ఆపరేషన్​ చేసి కణతిని తొలగించారు. ఆపరేషన్​ తర్వాత చిన్నారిని రెండు రోజులపాటు చిన్నపిల్లల ఐసీయూలో ఉంచి ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్​ చేశారు. కాగా, ఈ కణతి బరువు చిన్నారి శరీర బరువులో 45 శాతంగా ఉండేదని ఆపరేషన్​ చేపట్టిన ఎస్​ఎంఎస్​ ఆస్పత్రి డాక్టర్లు పేర్కొన్నారు. ఆపరేషన్​ విజయవంతం కావడం వల్ల వైద్యులు తమ బిడ్డకు పునర్జన్మను ప్రసాదించారని తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.

"చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించగా మెదడులోని కొంత భాగం కణతి లోపలికి వెళ్లినట్లు గుర్తించాము. కాగా, మెదడులోని ఏ భాగం కూడా దెబ్బతినకుండా కణతిని తొలగించడం మాకు పెద్ద సవాలుగా నిలిచింది. ఏ చిన్న పొరపాటు జరిగినా చిన్నారి ప్రాణాలకే ప్రమాదం. ఏది ఏమైనా మా వైద్యబృందం 4 గంటలు తీవ్రంగా శ్రమించి చిన్నారి తలపై ఏర్పడిన కణతిని విజయవంతంగా తొలగించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. నిద్రలో చిన్నారి శరీరం కూడా కదులుతోంది. అయితే ఆపరేషన్​కు ముందు బాధిత చిన్నారి శరీర బరువు 5 కిలోలు ఉండేది. ఇప్పుడు కణతిని తొలిగించడం వల్ల 3 కిలోలకు చేరింది."
- డాక్టర్​ బీఎల్​ భైరవ, ఎస్​ఎంఎస్​ ఆస్పత్రి అసోసియేట్​ ప్రొఫెసర్​

పడవ బోల్తా- 8 మంది మృతి- 100మంది గల్లంతు

బిడ్డకు జన్మనిచ్చిన 15 ఏళ్ల బాలిక- కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే మృత శిశువు జననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.