ETV Bharat / bharat

60 వెడ్స్​ 28.. లేటు వయసులో ఘాటు ప్రేమ.. పోలీస్ స్టేషన్​లో పెళ్లి - ఉత్తర్​ప్రదేశ్ భదోహి న్యూస్

ఆరు పదుల వయసులో తన ప్రియురాలి కోసం సాహసం చేశాడు ఓ వృద్ధుడు. అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ప్రియురాలిని తీసుకుని పారిపోయాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు ఈ ప్రేమ జంట. ఆఖరికి పోలీస్ స్టేషన్​నే వీరి వివాహ వేదికగా చేసుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

woman married old man
woman married old man
author img

By

Published : May 18, 2023, 7:33 AM IST

ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఏ వయసులోనైనా ప్రేమ కలగవచ్చని చెబుతుంటారు. ఇలాగే.. లేటు వయసులోనే ఓ వృద్ధుడికి ప్రేమ పుట్టింది. దీంతో కుటుంబ సభ్యులను ఎదురించి మరి ప్రేమ వివాహాన్ని చేసుకున్నాడు. ఇంతకీ ఈ ప్రేమ వివాహం ఎక్కడ జరిగిందో? వధూవరుల వయసు ఎంతో? వారి పెళ్లికి వచ్చిన అడ్డంకులు ఏంటో ఓ సారి తెలుసుకుందామా మరి.

ఉత్తర్​ప్రదేశ్​.. భదోహి జిల్లాలోని బీహరోజ్​పుర్​కు చెందిన రామ్​ యాదవ్​(60), దాదాపు తన వయసులో సగం వయసు ఉన్న అషర్ఫీ దేవి(28)ని ప్రేమించాడు. అయితే అషర్ఫీ దేవికి 2008లోనే కృష్ణ మూరత్ యాదవ్​తో వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కృష్ణ మూరత్.. కుటుంబ పోషణ కోసం తమిళనాడులో పని చేస్తున్నాడు. ఇటీవల అతడు తమిళనాడు నుంచి భదోహికి తిరిగి వచ్చాడు. అప్పటికే అషర్ఫీ దేవి.. రామ్ యాదవ్​తో పారిపోయింది. దీంతో తన భార్య కనిపించడం లేదని కృష్ణ మూరత్​.. కోయిరౌనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముమ్మరంగా గాలించి రామ్ యాదవ్​, అషర్ఫీ దేవిని పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్​కు తీసుకువచ్చారు.

రామ్ యాదవ్​, అషర్ఫీ దేవి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్​కు పిలిపించారు. ఇరు కుటుంబాల మధ్య గొడవ లేకుండా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. తన భర్త కృష్ణతో వెళ్లేందుకు అషర్ఫీ దేవి అంగీకరించలేదు. తన ప్రియుడు రామ్ యాదవ్​నే వివాహం చేసుకుంటానని పోలీసుల ఎదుట చెప్పింది. తన భర్తతో వెళ్లనని పోలీసులకు తెలిపింది. రామ్ యాదవ్​ కుమారుడు, కోడలు, మనమడు, మనమరాలు వచ్చి అతడిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా రామ్ యాదవ్​ కూడా వినలేదు. అషర్ఫీ దేవినే వివాహం చేసుకుంటానని.. ఆమె అంటే తనకు ఇష్టమని చెప్పాడు. దీంతో చేసేదేమి లేక ఇరువురి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్​నే తమ వివాహానికి వేదికగా చేసుకున్నారు రామ్ యాదవ్​, అషర్ఫీ దేవి. కోయిరౌనా పోలీస్ స్టేషన్​లో ఉన్న గుడిలో బుధవారం వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

woman married old man
వివాహం చేసుకుంటున్న రామ్ యాదవ్​, అషర్ఫీ దేవి

రామ్ యాదవ్​, అషర్ఫీ దేవీ చాలా కాలంగా ప్రేమించకుంటున్నారని కోయిరౌనా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ మక్కన్​ లాల్ తెలిపారు. రామ్ యాదవ్​, అషర్ఫీ దేవీ తమ కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించరనే భయంతో ఇంట్లో నుంచి పారిపోయారని ఆయన చెప్పారు. అషర్ఫీ దేవి భర్త కృష్ణ ఫిర్యాదు చేయడం వల్ల గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అషర్ఫీ దేవి, రామ్ యాదవ్​ను పట్టుకున్నామని.. అయితే ఆమె తన భర్తతో వెళ్లేందుకు ఇష్టపడలేదని మక్కన్ లాల్ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.