Bridge collapses: జమ్ముకశ్మీర్ సాంబా జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. 27 మంది కార్మికులు గాయపడ్డారు. రెండు స్తంభాలను కలిపే ఇనుప షట్టరింగ్ కాంక్రిట్ స్లాబ్‌పై అమర్చతుండగా ఈ దర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
తక్షణమే సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రామ్‌గఢ్-కౌల్పుర్ వద్ద దేవిక నదిపై సరిహద్దు రహదారి సంస్థ ఈ వంతెనను నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరిగి ప్రయాణంలో ప్రమాదంలో
జమ్ముకశ్మీర్ ఉధమ్‌పుర్ జిల్లాలో మినీ బస్సు-ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకుంది. ఈ ఘటనలో 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా దిల్లీకి చెందినవారిగా అధికారులు గుర్తించారు.