ETV Bharat / bharat

బ్లాక్ ఫంగస్​ ఇంజెక్షన్​తో 27 మందికి సీరియస్​

మధ్యప్రదేశ్​ బుందేల్​ఖండ్​ వైద్య కళాశాలలో 27 మంది మ్యూకర్​మైకోసిస్​(బ్లాక్​ ఫంగస్)​ బాధితులకు 'ఆంఫోటెరిసిన్ బి​' ఇంజెక్షన్​ అందించగా ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. దాంతో అప్రమత్తమైన వైద్యులు.. మిగతా రోగులకు ఈ ఇంజెక్షన్​ వేయటాన్ని నిలిపివేశారు.

author img

By

Published : Jun 6, 2021, 4:55 PM IST

black fungus injection
బ్లాక్ ఫంగస్​ ఇంజెక్షన్​తో ప్రతికూలతలు

మ్యూకర్​మైకోసిస్​(బ్లాక్​ ఫంగస్​) వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న 27 మందికి.. వైద్యులు ఇంజెక్షన్​ అందించగా వారి శరీరాల్లో ప్రతికూల మార్పులు కనిపించాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని బుందేల్​ఖండ్​ వైద్య కళాశాలలో జరిగింది. దాంతో వెంటనే.. మిగతా రోగులకు ఈ ఇంజెక్షన్​ను అందించటాన్ని వైద్యులు నిలిపివేశారు.

వివరాలు వెల్లడిస్తున్న బుందేల్​ఖండ్​ వైద్య కళాశాల వైద్యుడు ఉమేష్​ పటేల్​

బుందేల్​ఖండ్​ వైద్య కళాశాలలోని మ్యూకర్​మైకోసిస్​ వార్డులో చికిత్స పొందుతున్న 27 మందికి బ్లాక్​ ఫంగస్​ నివారణలో ఉపయోగించే 'ఆంఫోటెరిసిన్ బి​' ఇంజెక్షన్​ను వేసినట్లు వైద్యులు తెలిపారు. ఇంజెక్షన్​ ప్రతికూల ప్రభావాన్ని చూపగా అప్రమత్తమై... వెంటనే వారికి చికిత్స అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు.

మొత్తం 42 మంది బ్లాక్​ ఫంగస్​ బాధితులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి: 'కరోనాపై పోరాటం కోసం హోమం చేయాల్సింది'

ఇదీ చూడండి: టీకా తీసుకోకుండా తిరిగితే.. రూ.500 ఫైన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.