అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లో కొవిడ్ కారణంగా ఇప్పటివరకు 44 మంది మృతి చెందారు. వీరిలో 26 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. కేవలం 20 రోజుల వ్యవధిలో వీరు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఏఎంయూ ఉపకులపతి తారిక్ మన్సూర్ విజ్ఞప్తి మేరకు అధికారులు వైరస్ నమూనాలను సేకరించి పరీక్షల కోసం దిల్లీకి పంపించారు. కొత్త వేరియంటే మరణాలకు కారణమని అధికారులు భావిస్తున్నారు.
మృతి చెందిన 26 మంది ప్రొఫెసర్లలో 16 మంది సేవలు అందిస్తుండగా, 10 మంది పదవీ విరమణ పొందిన వారు ఉన్నారు.
ఇదీ చదవండి : కొవిడ్ వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు