ETV Bharat / bharat

Black Fungus: కరోనా సోకకుండానే అంటుకుంటున్న వ్యాధి! - corona

మధ్యప్రదేశ్​లోని ఇందోర్​ ఆసుపత్రిలో బ్లాక్​ఫంగస్(black fungus)​తో చేరిన రోగుల్లో 25-30శాతం మందికి ఇదివరకు కరోనా సోకిన ఆనవాళ్లు లేవు. ఈ విషయం ఆందోళనకు గురిచేస్తోంది.

black-fungus
బ్లాక్ ఫంగస్
author img

By

Published : Jun 17, 2021, 8:57 PM IST

మధ్యప్రదేశ్​ ఇందోర్​ మహారాజా యశ్వంత్రో ఆసుపత్రిలో బ్లాక్​ ఫంగస్(black fungus)​తో చేరిన రోగుల్లో 25-30శాతం మందికి ఇంతవరకు కరోనా సోకిన ఆనవాళ్లే లేవు. ఈ విషయాన్ని ఆసుపత్రితో అనుసంధానమైన మహాత్మాగాంధీ మెమోరియల్​ మెడికల్​ కాలేజీ డీన్​ డాక్టర్​ సంజయ్​ దీక్షిత్​ వెల్లడించారు. కరోనా సోకిన వారికే బ్లాక్​ ఫంగస్​ ముప్పు ఉందని ఇంతకాలం భావించిన తరుణంలో.. డీన్​ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించారు సంజయ్​ దీక్షిత్​. ఆయా రోగుల్లో ఇదివరకు కరోనా(corona virus) సోకినా.. పరీక్ష చేయించుకోలేదేమోనని.. వ్యాధి నుంచి వారికి తెలియకుండానే కోలుకుని ఉంటారని సంజయ్​ అన్నారు. కరోనా సోకకుండా బ్లాక్​ ఫంగస్​ బారిన పడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇందోర్​లోని మహారాజా యశ్వంత్రో ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో బ్లాక్​ ఫంగస్​ రోగులకు చికిత్స అందిస్తున్నారు. బ్లాక్​ ఫంగస్​తో ఈ ఆసుపత్రిలో 592 మంది చేరగా అందులో 251మంది కోలుకున్నారు. 47మంది చనిపోయారు. 294 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి: Black Fungus : కరోనా చికిత్స పొందుతుండగానే సోకుతున్న బ్లాక్ ఫంగస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.