ETV Bharat / bharat

ఆకాశ్ అంబానీ ఫేక్​ ఐడీతో ఆమెకు వల.. రూ.25 లక్షలు కాజేసి, న్యూడ్ ఫొటోస్​తో బెదిరించి..

author img

By

Published : Jan 2, 2023, 1:31 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ ఫేక్ ఐడీతో ఓ మహిళను మోసం చేసి రూ.25 లక్షలు తీసుకున్నాడో వ్యక్తి. ఈ సంఘటన గుజరాత్​లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

25 lakh cheating with Akash Ambani twitter fake ID in gujarat
ఆకాష్ అంబానీ ట్విట్టర్ ఫేక్ ఐడీతో రూ.25 లక్షలు చీటింగ్

రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ పేరుతో ట్విట్టర్​లో నకిలీ ఖాతా రూపొందించి మహిళకు టోకరా వేశాడు ఓ వ్యక్తి. ప్రీస్కూల్ మహిళా డైరెక్టర్​తో పరిచయం పెంచుకొని రూ.25 లక్షలు దోచుకున్నాడు. ఇంకా డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన గుజరాత్​లోని సూరత్​లో వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగిందంటే..
బాధితురాలు సూరత్​లోని వెసు ప్రాంతంలో ప్రీ స్కూల్ నడుపుతోంది. ఆకాశ్​ అంబానీ పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసుకున్న ఓ వ్యక్తికి, ఆమెకు సోషల్ మీడియా ద్వారా స్నేహం కుదిరింది. అయితే, ఐపీఎల్ బెట్టింగ్​లో కోట్లాది రూపాయాలు పోగొట్టుకున్నానని 'ఫేక్ ఆకాశ్ అంబానీ' ఆమెకు ఫోన్ ​చేసి చెప్పాడు. ఆ డబ్బులు తాను ఇంటి దగ్గర అడిగి తీసుకోలేనని చెప్పి.. కొంత నగదు పంపించమని అడిగాడు. ఆమె కూడా అందుకు అంగీకరించింది.

విడతలవారీగా రూ.25 లక్షలను అతడి ఖాతాలో వేసింది ఆ మహిళ. అయితే ఇది జరిగిన రెండేళ్ల తర్వాత ఆకాశ్ ఫ్రెండ్​నని పరిచయం చేసుకొని సచిన్ హాల్వాయ్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్​ చేశాడు. సూరత్​లో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు తమకు రూ.50 లక్షలు కావాలని చెబుతూ ఆమె​ను డబ్బు అడిగాడు. అనుమానం వచ్చిన ఆమె సచిన్​తో మాట్లాడటం మానేసింది.

అయితే అంతకుముందు మహిళ పంపించిన న్యూడ్ ఫొటోలను ఆసరాగా చేసుకొని ఆమెను బ్లాక్​మెయిల్ చేశాడు సచిన్. డబ్బులు ఇవ్వకపోతే న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించాడు. ఫొటోలను అమెరికాలో ఉంటున్న బంధువులందరికీ పంపిస్తానని మెసేజస్, మెయిల్స్ పంపించాడు. ఈ వ్యవహారంపై ఆమె సూరత్​లోని వేసు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆకాశ్ అంబానీ ఫేక్ ఐడీని ట్విట్టర్ నుంచి తొలగించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.