ETV Bharat / bharat

'భారత్​లో 24 కోట్ల విద్యార్థులపై కరోనా ప్రభావం'

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడి ఎంతోమంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ అనంతరం కొన్ని పాఠశాలలు తిరిగి పునఃప్రారంభమవుతుంటే మరికొన్ని వైరస్‌ సంక్షోభంతో శాశ్వతంగా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పాఠశాలలపై ఐరాస అనుబంధ సంస్థ యూనిసెఫ్‌ విడుదల చేసిన నివేదిక పలు ఆసక్తికర అంశాలను బయటపెట్టింది

UNICEF report on children affected by pandemic in india
'247 మిలియన్​ విద్యార్థుల చదువులపై పెను ప్రమాదం'
author img

By

Published : Mar 3, 2021, 8:57 PM IST

భారత్​లో కరోనా సంక్షోభం కారణంగా 15 లక్షల పాఠశాలలు మూతబడినట్లు యూనిసెఫ్‌ వెల్లడించింది. ఫలితంగా 24.7 కోట్ల మంది ప్రాథమిక, సెకండరీ స్థాయి విద్యార్థులపై ఈ ప్రభావం పడినట్లు నివేదికలో స్పష్టం చేసింది. కరోనా ప్రారంభానికి ముందే 60 లక్షల మంది బాల, బాలికలు పాఠశాలలకు దూరమైనట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 16.8 కోట్ల స్కూళ్లు ఏడాది పాటు పూర్తిగా మూతపడినట్లు యూనిసెఫ్ వెల్లడించింది. భారత్​లో ప్రతి నలుగురు చిన్నారుల్లో కేవలం ఒకరి వద్ద మాత్రమే డిజిటల్‌ పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపిన యూనిసెఫ్... భారత్‌లో ఆన్‌లైన్ విద్య అందరికీ అందుబాటులో లేదని స్పష్టం చేసింది. భారత్​లో 24 శాతం ఇళ్లలో మాత్రమే అంతర్జాల సౌకర్యం ఉన్నట్లు పేర్కొంది.

దేశంలో ఇప్పటికీ పాఠశాలలపై కరోనా ప్రభావం కొనసాగుతోందని యూనిసెఫ్‌ నివేదిక వెల్లడించింది. కేవలం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే 1 నుంచి 12వ తరగతి వరకు క్లాసులు జరుగుతున్నట్లు పేర్కొంది. 15 రాష్ట్రాల్లో 6 నుంచి 12 తరగతి వారికి విద్యాబోధన జరుగుతున్నట్లు చెప్పింది. క్రమంగా పాఠశాలలు తెరుచుకోవడం ద్వారా విద్యార్థుల్లో సన్నగిల్లిన ఆసక్తి తిరిగి పెంపొందే అవకాశముందని యూనిసెఫ్‌ తెలిపింది.

ఇదీ చదవండి:నిరసనకారులపై పోలీసుల కాల్పులు- 8 మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.