ETV Bharat / bharat

విపక్షాలకు పెరిగిన మద్దతు.. బెంగళూరు మీటింగ్​కు మరో 8 పార్టీలు.. హాజరుకానున్న సోనియా! - ప్రతిపక్షాల సమావేశం బెంగళూరు

Opposition Meeting In Bengaluru : ప్రతిపక్ష కూటమిలో పార్టీల సంఖ్య 24కు చేరింది. బెంగళూరులో జరిగే రెండో విడత విపక్షాల సమావేశానికి కొత్తగా మరో 8 పార్టీల ప్రతినిధులు హాజరవుతారని కూటమి వర్గాలు తెలిపాయి.

opposition meeting in bengaluru
opposition meeting in bengaluru
author img

By

Published : Jul 12, 2023, 11:05 AM IST

Opposition Meeting In Bengaluru : బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్షాలకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే 18 పార్టీలు కూటమిలో చేరగా.. తాజాగా మరో 8 పార్టీలు సైతం జతకట్టాయి. ఈ క్రమంలోనే జులై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగే సమావేశానికి మొత్తం 24 పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు. కర్ణాటక కాంగ్రెస్​ నిర్వహించే ఈ సమావేశంలో పాల్గొని.. కూటమికి తమ మద్దతును తెలియజేస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కూటమిలో కొత్తగా మరుమలర్చి ద్రవిడ మున్నెట్ర కళగం (MDMK) , కొంగు దేశ మక్కల్(KDMK)​, విడుదలై చిరుతైగల్​ కచ్చి (VCK), రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML)​, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీలు చేరాయి. ఇందులో MDMK, KDMK పార్టీలు 2014 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో ఉన్నాయి.

ఆహ్వానాలు పంపిన ఖర్గే
మరోవైపు ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా హాజరవుతారని కూటమి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని పార్టీలకు అహ్వానాలు పంపారు కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. జూన్​ 23న జరిగిన విపక్ష కూటమి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు ఖర్గే.

"బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆధ్వర్యంలో పట్నాలో జరిగిన విపక్ష కూటమి సమావేశం విజయవంతమైంది. ప్రజాస్వామ్యానికి హానికరమైన అనేక అంశాలపై చర్చించాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించాం. ఈ క్రమంలోనే మరిన్ని అంశాలపైన చర్చించాల్సిన అవసరం ఉంది. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించాల్సి ఉంది. అందుకోసం కూటమిలోని పార్టీలు జులై 17న బెంగళూరులో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరుకుంటున్నాను. అనంతరం సాయంత్రం 6 గంటలకు విందు సైతం ఉంటుంది. జులై 18 ఉదయం 11 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభం అవుతుంది."
--లేఖలో మల్లిఖార్జున ఖర్గే

జులై 17న జరిగే సమావేశానికి తాను హాజరు అవుతానని చెప్పారు ఆర్​జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్​. అంతకుముందు జూన్​ 23న బిహార్ రాజధాని పట్నాలో జరిగిన సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ నిర్వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి సమావేశం అవుతామని విపక్షాలు ప్రకటించాయి. ఇందుకోసం తొలుత జూన్‌ 29న శిమ్లాలో.. విపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. తర్వాత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వేదికను బెంగళూరుకు మార్చారు. జులై 13, 14 తేదీల్లో బెంగళూరులో విపక్షాల రెండో సమావేశం ఉంటుందని ప్రకటించారు. కానీ ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో జులై 17, 18కు మార్చారు.

ఇవీ చదవండి : విపక్ష కూటమిలోకి 17 పార్టీలు.. ఎవరి బలమెంత? ఇదీ అసలు లెక్క!

Opposition Meeting Bengaluru : 'మహా' రాజకీయాల ఎఫెక్ట్.. విపక్ష కూటమి భేటీ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.