భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో విజయాలతో దూసుకెళ్తోంది. వరుస ప్రయోగాలతో.. భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి తెలియపరుస్తోంది. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు(Pixxel satellite India) కూడా అంతరిక్ష ప్రయోగాలపై ఆసక్తి చూపుతున్నాయి. రాకెట్లు నిర్మించడం, లాంచింగ్ వెహికిల్స్, ఉపగ్రహాలు ప్రయోగించడం, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడం వంటివి చేసేందుకు ముందుకొస్తున్నాయి.
ఇప్పుడు దేశీయంగా ఓ ప్రైవేటు సంస్థ.. తొలిసారి భారత భూభాగం(Pixxel satellite India) నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. కర్ణాటక చిక్కమగళూరు జిల్లా ఆల్దూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల అవైస్ అహ్మద్ దీనికి ఆద్యులు. ఆయన సంస్థ పిక్సెల్(Pixxel space company) .. 2021 డిసెంబర్లో ఈ తొలి ప్రైవేట్ శాటిలైట్ ప్రయోగం చేయనున్నట్లు సమాచారం. ఇంకా అధికారిక తేదీ, శాటిలైట్ పేరును ఖరారు కాలేదు.
కరోనాతో వాయిదా..
ఈ ప్రయోగం (Pixel satellite launch) గతేడాదే జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 2020 డిసెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇస్రో సీఈఓలు సహా కొన్ని ప్రైవేటు కంపెనీలతో(Pixxel satellite India) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్పుడే.. అహ్మద్‌కు మద్దతుగా నిలిచారు మోదీ.
స్పేస్ ఎక్స్ చేసినా..
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ద్వారా 2018లో భారత్ తొలి ప్రైవేట్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. కానీ.. ఇది అమెరికా కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ వైమానిక స్థావరం నుంచి ప్రయోగించారు. ఇంకా అప్పుడు ఇతర 17దేశాలకు చెందిన 63ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్లాయి.
ఓ ప్రైవేటు సంస్థ(Pixxel satellite India) నిర్మించి, భారత భూభూగం నుంచి ప్రయోగించనున్న భారత తొలి శాటిలైట్ మాత్రం పిక్సెల్దేనని(Pixxel space company) తెలుస్తోంది. తొలుత రష్యాలో చేయాలనుకున్నప్పటికీ.. భారత నేలనుంచే ప్రయోగించాలన్నది అహ్మద్ కల.
లాస్ ఏంజెలస్‌లో 2019లో నిర్వహించిన టెక్స్టార్స్ స్టార్‌బర్ట్స్ యాక్సిలరేటర్‌కు ఆసియా నుంచి అర్హత సాధించిన ఏకైక స్టార్టప్ పిక్సెల్(Pixel satellite launch). అలా 2019లో అహ్మద్.. క్షితిజ్ ఖండేల్వాల్తో కలిసి సంస్థను ప్రారంభించారు. ఇది సూక్ష్మ శాటిలైట్లను రూపొందిస్తుంటుంది.
బిట్స్ పిలానీలో చదివిన తన కుమారుడికి అద్భుత నైపుణ్యాలు ఉన్నాయని చెబుతున్నారు అహ్మద్ తండ్రి నదీమ్ అహ్మద్(Pixxel space company) . ఇంకా ఈ శాటిలైట్.. ఇతర ఉపగ్రహాల కంటే 50 రెట్లు ఎక్కువగా డేటాను సేకరిస్తుందని అంటున్నారు.
ఇవీ చూడండి: Mangalyaan mission: 6 నెలలు అనుకుంటే.. 7 ఏళ్లు దాటేసింది..!