ETV Bharat / bharat

అమెజాన్​ ఉద్యోగులుగా కాల్​ చేస్తూ.. విదేశీయులకు ఎర!

అమెజాన్​ ఉద్యోగులమని చెప్పుకుంటూ.. నకిలీ కాల్​సెంటర్​ను (Fake Call Center) నడుపుతున్న 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా బాధితుల్లో ఎక్కువమంది ఆస్ట్రేలియన్​ వాసులే ఉన్నారని వెల్లడించారు.

west bengal fake call center
బంగాల్​ నకిలీ కాల్​ సెంటర్​
author img

By

Published : Sep 9, 2021, 10:19 AM IST

బంగాల్ (West Bengal Crime)​ కేంద్రంగా విదేశీయులను బురిడీ కొట్టిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు అక్కడి పోలీసులు. అమెజాన్​ సంస్థకు చెందిన ఉద్యోగులమని చెప్పుకుంటా.. అలిపోరే ప్రాంతంలో నకిలీ కాల్​ సెంటర్​ను(Fake Call Center) నడుపుతున్న 22 మందిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో కోల్​కతా పోలీసు- గూండా వ్యతిరేక విభాగం.. మంగళవారం రాత్రి అలిపోరేలోని బంకిమ్ ముఖర్జీ సరనీ ప్రాంతంలో సోదాలు నిర్వహించి, ఈ ముఠాను పట్టుకుంది.

"నిందితులు సరైన పత్రాలు లేకుండానే కాల్​సెంటర్​ను నడుపుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వాయిస్​ ఓవర్ ఇంటర్నెట్​ ప్రోటోకాల్​ ద్వారా, తమను తాము అమెజాన్​ సంస్థ ఉద్యోగులమని చెప్పుకుంటూ బాధితులకు నిందితులు ఫోన్​ చేసేవారని తేలింది. తమకు అమెజాన్ నుంచి బహుమతి వచ్చిందని, అందుకు డబ్బులు చెల్లిస్తే, రీఫండ్​ చేస్తామని చెప్పి మోసగించేవారు."

- పోలీసులు

బాధితుల్లో చాలా మంది ఆస్ట్రేలియన్ వాసులు ఉన్నారని పోలీసులు చెప్పారు. టీమ్​వ్యూయర్​, ఎనీడెస్క్ వంటి సాఫ్ట్​వేర్​ల సాయంతో బాధితుల కంప్యూటర్లను తమ నియంత్రణలోకి తెచ్చుకుని, వారిని ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా డిమాండ్​ చేసేవారని చెప్పారు. కాల్​ సెంటర్​ నుంచి అనేక నేరపూరితర కథనాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

ఇదీ చూడండి: 14 ఏళ్ల బాలికపై క్రూరత్వం.. 13 మంది కలిసి..

ఇదీ చూడండి: మద్యం మత్తులో దారుణం- తల్లిదండ్రులను గొడ్డలితో నరికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.