ETV Bharat / bharat

ఆక్సిజన్ కొరతతో 25 మంది రోగులు మృతి - జైపూర్​ గోల్డెన్ ఆసుపత్రిలో 20 మంది మృతి

oxygen shortage
ఆక్సిజన్ కొరత
author img

By

Published : Apr 24, 2021, 10:29 AM IST

Updated : Apr 24, 2021, 12:47 PM IST

10:27 April 24

ఆక్సిజన్ కొరతతో 25 మంది రోగులు మృతి

కరోనా కేసుల పెరుగుదల కారణంగా దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత తలెత్తి రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ముఖ్యంగా దేశరాజధానిదిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.  దిల్లీలోని జైపుర్‌ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత కారణంగా  తీవ్ర అనారోగ్యంతో ఉన్న 25 మంది రోగులు  ప్రాణాలుకోల్పోయారు. శుక్రవారం రాత్రి వీరు చనిపోయినట్లు ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ ఆస్పత్రిలో 200 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 శాతం మంది ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స పొందుతుండగా 35 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందనే వెంటనే సరఫరా చేయకపోతే వీరందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆస్పత్రి యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది.

''శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకే 3,600 లీటర్ల ఆక్సిజన్‌ ఆస్పత్రికి చేరాల్సి ఉంది. కానీ అర్ధరాత్రి 12  గంటలకు 1500 లీటర్ల ఆక్సిజన్‌ మాత్రమే ఆస్పత్రికి చేరింది. 7 గంటలు ఆలస్యంగా ప్రాణవాయువు రావడంతో అది అందక రోగులు ప్రాణాలు కోల్పోయారు'' అని ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డా.బలూజా పేర్కొన్నారు. 

వరుస ఘటనలు..

దిల్లీలోని అత్యంత ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన సర్‌ గంగారామ్‌లో ఆక్సిజన్‌ సరిపడా లేక గురువారం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ వద్ద కేవలం రెండు గంటలకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే ఉందని, అది కూడా అయిపోతే రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయని ఆస్పత్రి అత్యవసర సందేశం పంపింది. దీంతో ఆగమేఘాల మీద కదిలిన యంత్రాంగం రెండు ట్యాంకర్లు పంపింది.

Last Updated : Apr 24, 2021, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.