క్యాన్సర్ రోగులకు ఓ వైపు కీమోథరపీ పీడిస్తే.. ఆ ట్రీట్మెంట్ వల్ల రాలుతున్న జుట్టు చూసి వారు మరింత కుంగిపోతారు. వారిలో తిరిగి ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు కొందరు తమ జుట్టును దానం చేస్తారు. ఈ క్రమంలో కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఓ 2 ఏళ్ల నాలుగు నెలల వయసున్న ఓ చిన్నారి తన జుట్టును.. క్యాన్సర్ పేషెంట్స్‌కు డొనేట్ చేసి శభాష్ అనిపించుకుంది.
'ఆద్యా కులాల్ అనే చిన్నారి మనోధైర్యాన్ని చూసి నాకు సంతోషం కలిగింది. ఇంత చిన్న వయసులోనే ఆమె తన జుట్టును క్యాన్సర్ పేషెంట్లకు దానం చేసింది. సమాజంలోని ఎందరికో ఆ చిన్నారి స్ఫూర్తిగా నిలిచింది. పాప తల్లిదండ్రులు భరత్, సుమలత తమ కూతురిని సరైన మార్గంలో పెంచుతున్నారు. పెద్దయ్యాక.. చిన్నారి ఈ విషయం తెలుసుకుని ఎంతో సంతోషిస్తుంది'
--వేదవ్యాస కామత్. మంగళూరు సౌత్ ఎమ్మెల్యే
ఇదీ చదవండి: 'లాటరీ, మద్యం ఆదాయ వనరులా?'.. కేరళ సర్కారుపై గవర్నర్ ఆరిఫ్ ఫైర్
మోదీ దీపావళి గిఫ్ట్.. 70వేల మందికి నియామక పత్రాలు.. మరో 10లక్షల మందికి..