మహారాష్ట్ర ముంబయి విమానాశ్రయంలో చేపట్టిన తనిఖీల్లో టాంజానియాకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 2.225 కిలోల కొకైన్ పట్టుబడింది. దీని విలువ 13.35 కోట్ల రూపాయలు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తెలిపింది.
టాంజానియా జాతీయులైన మాంజీ కార్లోస్ ఆడమ్, రషీద్ పాల్ సయులా అనే ఇద్దరు వ్యక్తులు శరీరం లోపల డ్రగ్స్ పెట్టుకొని వచ్చారని అధికారులు తెలిపారు. వీరు దార్-ఎ-సలాం నుంచి అడ్డీస్ అబాబా మీదుగా ఏప్రిల్ 22న ముంబయికి వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా.. గత గురువారం తనిఖీలు నిర్వహించారు డీఆర్ఐ అధికారులు.
మేజిస్ట్రేట్ అనుమతితో జేజే ఆసుపత్రిలో వీరికి శస్త్ర చికిత్స నిర్వహించి ఒకరి కడుపులోంచి 97, మరొకరి నుంచి 54 క్యాప్సూల్స్‌ను బయటకు తీశారు వైద్యులు. ఈ క్యాప్సూల్స్ నుంచి.. 1415 గ్రా., 810 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: కశ్మీర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత