ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలోని ఓ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఇంటిపైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి తీవ్రంగా గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.

తాజ్గంజ్లోని ధంధాపుర ప్రాంతంలో 8.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అధికారి ప్రభు సింగ్ తెలిపారు. గాయాలపాలైనవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

