కన్నడ రాష్ట్రంలోని దావణగెరెలో ఓ మహిళ గర్భాశయంలో పెరిగిన 18.4 కిలోల కణతిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించి.. ఆమెకు పునరుజ్జీవం పోశారు వైద్యులు.
బళ్లారికి చెందిన ఓ మహిళ కడుపులో గత ఆరు నెలలుగా కణతి పెరుగుతోంది. ఆమె ఇటీవల ఆస్పత్రికి వెళ్లగా.. దాన్ని తొలగించాలని వైద్యులు చెప్పారు. తొలుత ఆమె ఆపరేషన్ అంటే భయపడ్డారు. అయితే.. ఇటీవల నొప్పి తీవ్రమవ్వడం వల్ల మరోసారి వైద్యుల్ని సంప్రదించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ గిరిధర, సర్జన్ డాక్టర్ రవీంద్ర.. సదరు మహిళకు శస్త్రచికిత్స చేసి కణతిని తొలగించారు.
శస్త్రచికిత్స విజయవంతంగా చేసినందుకు.. బాధితురాలి కుటుంబ సభ్యులు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: రాడార్లకు చిక్కని యుద్ధనౌకలు!