ETV Bharat / bharat

15నెలల బాలుడికి అరుదైన వ్యాధి- రూ.17 కోట్ల ఇంజెక్షన్​తో నిలిచిన ప్రాణాలు- ఎలా సాధ్యమైందంటే? - బాలుడికి అరుదైన వ్యాధి ఇంజెక్షన్

17 Crore Injection For Child : అరుదైన వ్యాధితో బాధపడుతున్న 15 నెలల వయసున్న బాలుడు విధితో పోరాడి విజయం సాధించాడు. రూ.17 కోట్ల ఇంజెక్షన్ ఇస్తేనే నయమయ్యే వ్యాధితో బాధపడుతున్న అతడికి సాయం చేసేందుకు దాతలు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం సైతం సహకరించడం వల్ల అతడు ఇబ్బందులను అధిగమించి ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

17-crore-injection-for-child
17-crore-injection-for-child
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 6:30 PM IST

Updated : Dec 17, 2023, 6:57 PM IST

15నెలల బాలుడికి అరుదైన వ్యాధి- 17 కోట్ల ఇంజెక్షన్​తో నిలిచిన ప్రాణాలు

17 Crore Injection For Child : ఉత్తర్​ప్రదేశ్ సహారన్​పుర్​కు చెందిన భూదేవ్ అనే బాలుడు 15 నెలలకే చావుతో పోరాడి గెలిచాడు. ఎస్ఎంఏ-టైప్1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ బాలుడు బతకాలంటే 17 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. రెక్కాడితేగానీ డొక్కాడని భూదేవ్ కుటుంబానికి 17 కోట్లంటే మామూలు విషయం కాదు.

కానీ, విధి భూదేవ్ పక్షానే నిలిచింది. అతడికి సాయం చేసేందుకు ఫార్మా దిగ్గజం నొవార్టిస్ ముందుకొచ్చింది. ఎంతో మంది దాతలు సైతం భూదేవ్ కోసం కదిలారు. 'సేవ్ భూదేవ్' క్యాంపెయిన్​ను నడిపించారు. కేంద్ర ప్రభుత్వం సైతం తన వంతుగా ఈ ఇంజెక్షన్​ను దిగుమతి సుంకం నుంచి మినహాయించింది. ప్రభుత్వం నిర్ణయంతో రూ.17 కోట్లుగా ఉండే ఇంజెక్షన్ ధర రూ.10 కోట్లకు దిగివచ్చింది. దాతల సాయంతో దిగుమతి చేసుకున్న ఈ ఇంజెక్షన్​ను బాలుడికి ఇచ్చారు దిల్లీ ఎయిమ్స్ వైద్యులు.

17-crore-injection-for-child
భూదేవ్

"భూదేవ్​కు ఇంజెక్షన్ డోసు ఇస్తారన్న విషయం వారం క్రితం మాకు తెలిసింది. దీంతో మా కుటుంబంలో అందిలోనూ సంతోషం వెల్లివిరిసింది. భూదేవ్ ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా."
-గౌరవ్ శర్మ, భూదేవ్ కుటుంబ సభ్యుడు

త్వరలో కోలుకునే అవకాశం!
భూదేవ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని బాలుడికి ఇంజెక్షన్ ఇచ్చిన దిల్లీ ఎయిమ్స్ డాక్టర్ షెఫాలీ గులాటీ పేర్కొన్నారు. పూర్తిగా కోలుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుందని తెలిపారు.

"బాలుడి వయసు 15 నెలలు. రెండు మూడు వారాల్లో అతడి నాడీ వ్యవస్థలో చలనం ఉంటుందని అంచనా వేస్తున్నాం. అతడి తల నియంత్రణలో ఉండటం, కూర్చోవడం, స్వయంగా నిల్చోవడం వంటివి జరగొచ్చు. వారాల నుంచి నెలల కాల వ్యవధిలో క్రమంగా ఈ పురోగతి కనిపిస్తుంది. బాలుడికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం ముఖ్యం."
-షెఫాలీ గులాటీ, ఛైల్డ్ న్యూరాలజీ డివిజన్, దిల్లీ ఎయిమ్స్

17-crore-injection-for-child
ఆస్పత్రిలో భూదేవ్

ఇంజెక్షన్ తీసుకున్న భూదేవ్​ను ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
కాగా, గతంలో ఇదే వ్యాధితో బాధపడిన ఓ చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్ అందించినా ప్రాణాలు నిలవలేదు. చిన్నారి తల్లిదండ్రులు ఎంతో శ్రమించి దాతల నుంచి రూ.16 కోట్లు సమకూర్చారు. కానీ, ఇంజెక్షన్ ఇచ్చిన కొన్ని నెలలకే చిన్నారి చనిపోయింది. పూర్తి వివరాలకు లింక్​పై క్లిక్ చేయండి.

వెంకీ 'సైంధవ్​' పోరాటం.. రూ.16కోట్ల ఇంజెక్షన్​ ఈ పాప కోసమే!

16 crore for Child Treatment: పాప ప్రాణానికి రూ.16 కోట్ల ఇంజక్షన్​.. సాయం కోసం ఎదురుచూపు

Last Updated : Dec 17, 2023, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.