ETV Bharat / bharat

కన్నబిడ్డపై రేప్.. తల్లిదండ్రులకు మరణ శిక్ష.. లిఫ్ట్​లో బాలికకు వేధింపులు - లైంగిక వేధింపులు

Child Sexual abuse Death penalty: కన్నబిడ్డపై లైంగిక వేధింపులకు పాల్పడి హత్య చేసిన తల్లిదండ్రులపై న్యాయస్థానం కొరడా ఝులిపించింది. దోషులకు మరణ శిక్ష విధించింది. మరోవైపు, లిఫ్ట్​లో బాలికను వేధించాడు ఓ బాలుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు.

Parents Sexual abuse Child
Parents Sexual abuse Child
author img

By

Published : Jun 4, 2022, 8:25 AM IST

Updated : Jun 4, 2022, 12:07 PM IST

Parents Sexual abuse Child: పదహారు నెలల చిన్నారిని తల్లిదండ్రులు వేధింపులకు గురిచేసిన కేసులో మహారాష్ట్ర సోలాపుర్​ జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. చిన్నారి తల్లిదండ్రులకు మరణ శిక్ష విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. వేధింపులకు సంబంధించిన ఘటన జనవరి 3న జరిగింది. విచారణ అనంతరం దోషులుగా తేలిన వీరిద్దరికీ మరణ శిక్షే సరైనదని కోర్టు అభిప్రాయపడింది.

రాజస్థాన్​కు చెందిన నిందితులు ధోల్​రామ్ అర్జున్​రామ్ బిష్ణోయ్(26), పుణికుమారి(10) హైదరాబాద్​లో పని చేసుకునేవారు. తమ చిన్నారిపైనే వీరు వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం చంపేశారు. బిడ్డ మృతదేహాన్ని తీసుకొని సికింద్రాబాద్ రాజ్​కోట్ ఎక్స్​ప్రెస్ రైలెక్కి సొంతూరికి బయల్దేరారు. అయితే, ఎంతసేపటికీ చిన్నారిలో కదలికలు లేవని గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. జనవరి 4న మహారాష్ట్రలోని సోలాపుర్ రైల్వే స్టేషన్​లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

చిన్నారిని భౌతికంగానే కాక, లైంగికంగానూ వేధించారని శవ పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. దీంతో నిందితులపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. హత్య కేసు కూడా పెట్టారు. మొత్తం 31 మంది సాక్షులను విచారించి నిందితులను దోషులుగా తేల్చింది ఫాస్ట్​ట్రాక్ కోర్టు. డీఎన్ఏ రిపోర్టులు, వైద్య పరీక్షలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించిన జిల్లా, సెషన్స్ జడ్జి యూఎల్ జోషీ.. దోషులకు మరణ శిక్ష విధించారు.

Girl molested inside the Lift: మరోవైపు, గుజరాత్​లోని దిండోలీ జిల్లాలో 12ఏళ్ల బాలికను లిఫ్ట్​లో వేధించాడు మైనర్. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. తొలుత బాలిక లిఫ్ట్​లోకి ప్రవేశించగా.. అనంతరం బాలుడు లోపలికి వచ్చాడు. లిఫ్ట్ డోర్ మూసుకోగానే బాలిక దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. లిఫ్ట్ ఆగిన తర్వాత బాలిక బయటకు వెళ్లేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. అయితే, నిందితుడు బాలికను అడ్డగించాడు. మరో ఫ్లోర్​కు వెళ్లిన తర్వాత లిఫ్ట్ ఆగిపోగా.. బాలుడు పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

lift molestation
లిఫ్ట్​లో వేధిస్తున్న బాలుడు

ఇదీ చదవండి:

Last Updated : Jun 4, 2022, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.