ఒడిశాలో ఓ వ్యక్తి.. 12 వీధి కుక్కలకు విషం పెట్టి చంపిన ఘటన మరువక ముందే.. కర్ణాటక కోలార్ జిల్లాలోనూ అటువంటి హృదయవిదారక సంఘటన వెలుగుచూసుంది. 16 కోతులకు విషం(monkeys poisoned Karnataka) పెట్టి.. కళేబరాలను సంచుల్లో వేసి జిల్లాలోని తమక సమీపంలోని రోడ్డు పక్కన పడేశారు దుండగులు. వాటిల్లో నాలుగు పిల్లలు కూడా ఉన్నాయి.
![16 Monkeys poisoned, killed and thrown on the road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-klr-monkeys-death-av-ka10049_29092021133821_2909f_1632902901_115_2909newsroom_1632921681_36.jpg)
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు.. వాటిని పోస్టుమార్టం కోసం తరలించారు. రక్త నమూనాను సేకరించి పరిశీలించిన పశుసంవర్ధక శాఖ వైద్యులు.. విషపూరితం ఆహారం తినడం వల్లే కోతులు(monkey death in Karnataka) చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.
చనిపోయిన కోతుల అంత్యక్రియలను పూర్తి చేశారు అటవీ శాఖ సిబ్బంది.
కొన్ని రోజుల క్రితం హసన్ జిల్లాలోనూ(monkey death in Hassan) ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో 40కి పైగా కోతులు మరణించాయి.
ఇదీ చూడండి: వీధి కుక్కలకు విషం పెట్టి హత్య.. 12 శునకాలు మృతి