ప్రపంచంలోనే అతిపెద్ద దీపదాన మహోత్సవం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. దీనిని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ నిర్వహించారు. ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 16 లక్షల దీపాలను వెలిగించారు.
ఈ వేడకకు ఇండోర్‌లోని పిత్ర్ పర్వత్ హనుమాన్ ఆలయం వేదికైంది. అయోధ్యలోని రామమందిరానికి అర్పించిన ఈ దీపాలను తొలుత సాధువులు వెలిగించగా.. అనంతరం కైలాశ్, భక్తులు జ్యోతులను ముట్టించారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు దీపాల వెలుగులో శోభాయమానంగా మారాయి. ఈ గుడిలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అష్టలోహ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు భక్తులు.
వేడుకలో విజయ వర్గీయ సహా ఆయన కుమారుడు, ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ హనుమాన్ చాలిసా పఠించారు. ఆస్పత్రిలో ఉన్న ఎంపీ నందకుమార్ సింగ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్నారు. ఆంజనేయుడు అందరికీ మంచి చేయాలని వేడుకున్నారు.
ఇదీ చూడండి: కొవాగ్జిన్ టీకాతో మోదీ ఇచ్చిన సందేశమేంటి?