ETV Bharat / bharat

152 మంది పోలీసులకు హోంమంత్రి ఎక్స్​లెన్స్ మెడల్

కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్​లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు దేశవ్యాప్తంగా 152 మంది పోలీసులు ఎంపికయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికైనట్లు కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున మెడల్ అందుకోనున్నట్లు వెల్లడించింది.

HOME MINISTER MEDAL
కేంద్ర హోంశాఖ
author img

By

Published : Aug 12, 2021, 12:14 PM IST

కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అందించే 'కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్​లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్' అవార్డుకు 152 మంది పోలీసు అధికారులు ఎంపికయ్యారు. ఇందులో 15 మంది సీబీఐ నుంచి ఉన్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఇక రాష్ట్రాల వారిగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున ఈ మెడల్​కు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 11 మంది చొప్పున పోలీసులను ఈ అవార్డు వరించింది. ఉత్తర్​ప్రదేశ్ నుంచి 10, కేరళ, రాజస్థాన్​ల నుంచి 9 మంది చొప్పున,తమిళనాడు నుంచి ఎనిమిది మంది పోలీసులు మెడల్ అందుకోనున్నారు.

బిహార్ నుంచి ఏడుగురు, గుజరాత్, కర్ణాటక, దిల్లీ నుంచి ఆరుగురి చొప్పున ఈ మెడల్​కు ఎంపిక అయ్యారు. మొత్తం జాబితాలో 28 మహిళా పోలీసు అధికారులు సైతం చోటు దక్కించుకున్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది.

సర్టిఫికేట్-అవార్డు

నేర విచారణలో మెరుగైన ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు ఈ అవార్డు అందిస్తారు. ఏటా 162 మందికి మించకుండా అధికారులను ఈ మెడల్​కు ఎంపిక చేస్తారు. కేంద్ర హోంమంత్రి సంతకం చేసిన సర్టిఫికేట్ సహా.. కాపర్-నికెల్ మిశ్రమాలతో తయారు చేసిన మెడల్​ను ఎంపికైన అధికారులకు ప్రదానం చేస్తారు.

ఇదీ చదవండి: 'పార్లమెంట్ సమావేశాలు జరగలేదనే ప్రజలు అనుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.