ETV Bharat / bharat

14ఏళ్ల యోగా టీచర్.. ఒకేసారి రెండు పీహెచ్​డీలు.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా! - రెండు డాక్టరేట్లు సాధించిన 14 ఏళ్ల బాలిక

14 ఏళ్ల వయసులోనే పరిశోధనలు చేసి.. ప్రపంచంలోని రెండు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లను సంపాదించింది ఓ చిన్నారి. దేశంలోనే ఈ ఘనత వహించిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. ఆ బాలిక ఎవరు? ఆ వివరాలేంటో ఓసారి చూసేద్దామా...?

doctorate from columbia and ghana university

author img

By

Published : Oct 13, 2022, 7:56 PM IST

ఒకేసారి రెండు డాక్టరేట్లు.. 14 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత

మహారాష్ట్ర నాశిక్​కు చెందిన గీత్​ పత్ని అరుదైన ఘనత సాధించింది. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోని రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్​ను సంపాదించింది. 'ఫోన్​ అధిక వినియోగం వల్ల పిల్లలపై పడే ప్రభావాలు' అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్​లు వరించాయి. ఏకకాలంలో రెండు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా గీత్​ పత్ని రికార్డు సాధించినట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

doctorate from columbia and ghana university
గీత్​ పత్ని సాధించిన డాక్టరేట్లు

యోగా చేస్తున్న గీత్​ పత్ని

నాశిక్​కు చెందిన గీత్​ పత్ని.. స్థానిక నిర్మలా కాన్వెంట్ స్కూల్​లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి పరాగ్​ పత్ని, తల్లి కాజల్ పత్ని ఇద్దరూ వైద్యులే. పరాగ్, కాజల్ శారీరక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. తల్లిదండ్రులిద్దరినీ చూస్తూ పెరిగిన గీత్​ కూడా ఫిట్​నెట్​పై ఆసక్తి కనబరిచేది. దీంతో యోగాపై మాస్టర్స్​ పూర్తి చేయడమే కాకుండా.. అనేక మందికి శిక్షణ ఇస్తోంది.

ఈ క్రమంలోనే దేశంలో కరోనా విజృంభించింది. లాక్​డౌన్​తో పాఠశాలలు మూతపడడం వల్ల పిల్లల్లో ఫోన్​ వాడకం మితిమీరిపోయింది. ఇలా అధికంగా ఫోన్​ వినియోగంతో పిల్లల ఆరోగ్యం చెడిపోతుందని గ్రహించింది గీత్ పత్ని. దీనిపై కలత చెందిన చిన్నారి​.. ఈ అంశంపై పరిశోధన పత్రాన్ని రూపొందించి ప్రపంచంలోని ఏడు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు పంపించింది. ఈ పత్రాలను పరిశీలించిన కొలంబియా, ఘనా విశ్వవిద్యాలయాలు.. గీత్​కు డాక్టరేట్​ను ప్రకటించాయి.

"ఫోన్​ వినియోగంపై పిల్లల తల్లిదండ్రుల వద్ద నుంచి వివరాలు సేకరించి.. పరిశోధన పత్రాన్ని రూపొందిచా. నేను ఏం చేస్తున్నానో నా తల్లిదండ్రులకు తెలియదు. పరిశోధన మొత్తం పూర్తయ్యాక చెప్పాను. వారు పరిశోధన పత్రం చూసి బాగుందని.. దీనిని విశ్వవిద్యాలయాలకు పంపించారు. మొత్తం ఏడు విశ్వవిద్యాలయాలకు పంపించగా.. కొలంబియా, ఘనా విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ వచ్చింది."
-గీత్​ పత్ని, డాక్టరేట్ గ్రహీత

"గీత్​ చిన్ననాటి నుంచి చాలా తెలివైనది. ఏ పని చేసినా పూర్తి మనసును కేంద్రీకరించి చేస్తుంది. యోగాపై పరిశోధన చేసి టీచర్​గా మారింది. అనేక అవార్డులను సైతం గెలుచుకుంది. ఆమె మా కూతురు అయినందుకు గర్వ పడుతున్నాము."
-పరాగ్ పత్ని, తండ్రి

ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న గీత్​.. రెండు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్​ పొందడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గీత్​ సాధించిన ఘనతపై.. స్నేహితులు, బంధువుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన తల్లిదండ్రుల సహకారం లేనిదే ఈ డాక్టరేట్​లు సాధించేదాన్ని కాదని గీత్​ చెబుతోంది. ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని పిలుపునిస్తోంది.

ఇవీ చదవండి: అటెండర్​గా పనిచేసిన కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్​గా.. డ్యూటీ చేస్తూనే చదువుతూ..

జాతరలో బోర్ కొట్టి చెరువు గట్టున వాకింగ్.. వజ్రం దొరికి రాత్రికి రాత్రే లక్షాధికారిగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.