ETV Bharat / bharat

గేమ్​ పేరిట బాలుడికి వల.. అమ్మనాన్నల ఫోన్లు హ్యాక్.. ఆ ఫొటోలు తీయించి... - Cyber Attack On Parents

సైబర్​ హ్యాకర్ల ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా జైపుర్​లో 13 ఏళ్ల బాలుడిని ట్రాప్ చేసిన హ్యాకర్​.. అతనితో అసభ్యకర పనులు చేయించాడు. ఇంతకీ ఆ చిన్నారి సైబర్​ ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది?

13-year-old-threatens-by-cyber-hacker-of-jaipur-to-hack-parents-3-mobile
హ్యాకింగ్​ ఉచ్చులో బాలుడు.. సోషల్​ మీడియాలో ఇంట్లో వాళ్ల అసభ్యకర ఫొటోలు..
author img

By

Published : Jun 21, 2022, 4:54 PM IST

ఓ సైబర్​ హ్యాకర్​ 13 ఏళ్ల చిన్నారిని ట్రాప్ చేసి.. అతడి కుటుంబ సభ్యుల అందరి ఫోన్లను హ్యాక్​ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ జైపుర్​లోని హర్మడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాను చెప్పిన పని చేయాలని లేకుంటే.. తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించడం వల్ల భయపడి.. హ్యాకర్​ చెప్పిందల్లా చేశాడు ఆ బాలుడు. చివరకు ఈ విషయం పోలీసుల వరకు వెళ్లగా అసలు సంగతి బయటకు వచ్చింది.

జరిగింది ఇదీ..
రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన 8వ తరగతి చదువుతున్న బాలుడు.. మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుంటాడు. అతడికి కొంతమందితో స్నేహం ఏర్పడింది. అందులో హ్యాకర్​ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి ఒక లింక్​ పంపి.. అందులో కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు పంపాలని కోరాడు. అడిగిన సమాచారం మొత్తాన్ని ఆ బాలుడు ఇచ్చేశాడు. ఓటీపీలను కూడా హ్యాకర్​కు షేర్​ చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మొబైల్‌లో హ్యాకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులకు చెందిన 3 ఫోన్లను హ్యాక్​ చేసి.. వారికి తెలియకుండా సోషల్​ మీడియాలో అసభ్యకర ఫొటోలు, పోస్టులు పెట్టడం ప్రారంభించాడు.

అంతేకాదు.. బాలుడికి టాస్క్​లు కూడా ఇచ్చేవాడు ఆ హ్యాకర్. చెప్పిన పని చేయకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలుడు తన ఇంట్లోనే స్పై చేయాల్సి వచ్చింది. హ్యాకర్ చెప్పినట్టు.. ఇంట్లోని గోడలకు, టేబుళ్ల కింద చిన్న చిన్న చిన్న డివైజ్‌లు అమర్చాడు.

ఈ పరిణామాలు బాలుడి తల్లిదండ్రులకు అనుమానాన్ని కలిగేలా చేశాయి. సోషల్ మీడియా ఖాతాల్లో అసభ్యకర ఫొటోలు కనిపించడం.. ఇంట్లోని గోడలకు డివైజ్​లు ఉండడం చూసి పోలీసులను ఆశ్రయించారు. సైబర్ పోలీసులు ఆ ఇంటిని పరిశీలించి, బాలుడిని ప్రశ్నించి.. అసలు విషయం తెలిసింది. జైపుర్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని, దర్యాప్తు కొనసాగుతోందని జైపుర్​ కమిషనరేట్ సైబర్ నిపుణుడు ముఖేశ్ చౌదరి చెప్పారు.

ఇదీ చదవండి: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. ఆయనే ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.