ETV Bharat / bharat

13 ఏళ్ల బాలిక 'కాన్వాస్'​ కళ- నైపుణ్యం భళా - paintings of bollywood actress

రాజస్థాన్​ అజ్​మేర్​లోనే అతి చిన్న వయసులో రచయితగా గుర్తింపు తెచ్చుకుంది 13 ఏళ్ల అదితి కల్యాణి. 2017లో అడ్వెంచర్​​ ఆఫ్​ తుబి అండ్​ హర్​ ఫ్రెండ్స్​ పుస్తకం రాసినందుకు ఎన్నో అవార్డుల్ని అందుకున్న ఆ బాలిక కాన్వాస్​ పెయింటింగ్​లోనూ మేటి అని నిరూపించుకుంది. ఆ పెయింటింగ్స్​ వల్ల అనేకమంది ప్రశంసలను పొందుతోంది.

13-year-old artist makes canvas paintings, wins hearts
క్యాన్వస్​ పెయింటింగ్స్​తో ఆకట్టుకుంటున్న 13ఏళ్ల బాలిక
author img

By

Published : Jan 25, 2021, 8:50 AM IST

Updated : Jan 25, 2021, 9:01 AM IST

క్యాన్వాస్​ పెయింటింగ్స్​తో ఆకట్టుకుంటున్న 13ఏళ్ల బాలిక

తన వయస్సు కేవలం 13ఏళ్లే.. అయితేనేం కలం పట్టిందంటే కళ్లముందు కదలాడేలా కథలు రాస్తుంది. దీనికితోడు కుంచే అందుకుందంటే బొమ్మ అదిరిపోవాల్సిందే. రాజస్థాన్​ అజ్​మేర్​​లోనే.. అతి చిన్న వయస్సులో రచయితగా గుర్తింపుపొందిన ఆ బాలిక.. ఇప్పుడు తన పెయింటింగ్స్​తోనూ ప్రశంసలు పొందుతోంది.

13-year-old artist makes canvas paintings, wins hearts
1950 నాటి నటీమణులైన సూరియా, రేష్మా, శ్యామ, సంధ్య, షకీలా, నిమ్మి మొదలైన వారి చిత్రాల్

కాన్వాస్​ పెయింటింగ్స్​తో​ ఇప్పుడు అందరినీ అబ్బురపరుస్తోన్న బాలిక పేరు అదితి కల్యాణి. ఆమె గీసే చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. 1940లోని భారత సినీ నటీమణుల చిత్రాల్ని క్యాన్వస్​పై గీసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అబ్బుర పరిచే ఆ చిత్రాలతో తాను మల్టీ టాలెంటెడ్​ అని చాటుకుంటోంది.

13-year-old artist makes canvas paintings, wins hearts
క్యాన్వస్​ పెయింటింగ్స్​తో ఆకట్టుకుంటున్న 13ఏళ్ల బాలిక

ఆ పెయింటింగ్స్​ మాత్రమే కావు..

తన పెయింటింగ్స్​లో ఉన్న విశేషమేమిటంటే.. నాటి నటీమణులు ఎలా ఉండే వారు, సినీ రంగంలో వారు అడుగు పెట్టడానికి ముందు ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నారు? అనే విషయాలు అందులో ప్రతిబింబిస్తాయి.

గత మూడేళ్లుగా అదితి.. కాన్వాస్​​ పెయింటింగ్స్​ను వేస్తోంది. ప్రదర్శనలో ఉన్న ఆమె పెయింటింగ్స్​ను పలువురు సందర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో​ అదితి ముచ్చటించారు.

"1950లోని నటీమణులు.. సినిమాలోకి అడుగుపెట్టే ముందు వారికి స్వేచ్ఛ లేదు. నాలుగు గోడల మధ్య వారిని బందీగా ఉంచి విద్యావకాశాలకు దూరం చేశారు. ఈ పెయింటింగ్స్​ అప్పటి నటీమణుల కష్టాల్ని, నటనకోసం వారు పడ్డ తపనని తెలియజేస్తాయి. అప్పటి నటీమణులు చాలా కష్టాలను ఎదుర్కొని సినిమారంగంలో రాణించారు. ఉదాహరణకు నూర్జహాన్​, దర్శకురాలిగా,నిర్మాతగా గాయనిగా రాణించారు. అలాంటి వారిగురించి తెలియజేయడానికే వారి చిత్రాల్ని గీశాను. 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ పెయింటింగ్స్​లోని నటీమణుల్ని గుర్తించగలరు. ఈ తరం వారికి వారేవరో తెలియదు. అందుకే వారి గురించి తెలియజేయడానికే ఈ పెయింటింగ్స్​ వేశాను."

-అదితి కల్యాణి, పెయింటర్​

1950 నాటి నటీమణులైన సూరియా, రేష్మా, శ్యామ, సంధ్య, షకీలా, నిమ్మి మొదలైన వారి చిత్రాల్ని అదితి గీసింది. ఈ ప్రదర్శన కొత్త అనుభూతినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

రచయితగా..

2017లో అడ్వెంచర్​ ఆఫ్​ తుబి అండ్​ హర్​ ఫ్రెండ్స్​ పుస్తకం రాసినందుకు ఎన్నో అవార్డుల్ని అందుకుంది అదితి కల్యాణి. ఆ పుస్తకంలో 11 చిన్న కథల్ని 9000 పదాలతో రాసింది. ఆ కథలేకాదు వాటిలోని బొమ్మలూ మనల్ని ఆకట్టుకుంటాయి.

ఇదీ చూడండి: కుమారుడి మరణం.. పోసింది ఆరోగ్య కేంద్రానికి ప్రాణం!

Last Updated : Jan 25, 2021, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.