గుజరాత్లో భారీ మొత్తాల్లో మత్తు పదార్థాలను (drugs seized) ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పట్టుకుంది. ద్వారకాలోని మోర్బిలో 120 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు (drugs seized in gujarat) వెల్లడించారు అధికారులు. వాటి విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని తెలిపారు.
నవ్లఖి నౌకాశ్రయానికి దగ్గరలోని జిన్జుడా గ్రామంలో మత్తుపదార్థాల ముఠా ఉందనే ముందస్తు సమాచారంతో ఆదివారం రాత్రి ఏటీఎస్ తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో 120 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అయితే.. సెప్టెంబర్‌లో ముంద్రా పోర్టు నుంచి సుమారు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇంత మొత్తాల్లో మత్తు పదార్థాలను పట్టుకోవడం ఇదే మొదటిసారి.