ETV Bharat / bharat

12 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు​- విపక్షాల అత్యవసర భేటీ - పార్లమెంట్​ సమావేశాలు

పార్లమెంట్​ శీతాకాల సమావేశాల(parliament winter session) తొలిరోజునే 12 మంది రాజ్యసభ ఎంపీలపై వేటు పడింది(rajya sabha mps suspended). వర్షాకాల సమావేశాల్లో ప్రవర్తనపై క్రమశిక్షణా చర్యల కింద కాంగ్రెస్​, శివసేన, టీఎంసీ సహా పలు పార్టీల నేతలను సస్పెండ్​ చేసింది రాజ్యసభ. ఈ నేపథ్యంలో మంగళవారం అత్యవసర భేటీకి పిలుపునిచ్చాయి విపక్షాలు.

Rajya Sabha MPs suspended
పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు
author img

By

Published : Nov 29, 2021, 5:26 PM IST

Updated : Nov 29, 2021, 10:51 PM IST

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు(parliament winter session) ప్రారంభమైన తొలిరోజునే పలువురు విపక్ష సభ్యులకు రాజ్యసభలో గట్టి షాక్​ తగిలింది. గత వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది(rajya sabha mps suspended) రాజ్యసభ. ఈ మేరకు కాంగ్రెస్​ సహా పలు పార్టీలకు చెందిన 12 మందిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​ నారాయణ్​ సింగ్​. ప్రస్తుతం ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ వారిపై సస్పెన్షన్​ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఒకేసారి 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్​ చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. సస్పెండ్​ అయిన ఎంపీల్లో కాంగ్రెస్(congress mps suspended)​ నుంచి ఆరుగురు.. ఫులో దేవి నేతమ్​, ఛయా వర్మ, ఆర్​ బోరా, రాజమణి పటేల్​, సయ్యద్​​ నాసిర్​ హుస్సేన్​, అఖిలేశ్​ ప్రసాద్​ సింగ్​లు ఉండగా.. సీపీఎం నేత ఎలమరమ్​ కరీమ్​, సీపీఐ నేత బినోయ్​ విస్వమ్​, టీఎంసీ నేతలు దోలా సెన్​, శాంట ఛెత్రి, శివసేన నుంచి ప్రియాంక ఛతుర్వేది, అనిల్​ దేశాయ్​లపై వేటు పడింది.

తొలిరోజే రాజ్యసభలో విపక్షాల ఆందోళనల పర్వం కొనసాగింది. సాగు చట్టాల రద్దు(farm laws repeal) బిల్లుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టటం వల్ల సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభ మంగళవారానికి వాయిదా పడింది.

'సభను అగౌరవపరిచినందుకే..'

12 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్​ చేయడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. సభ నుంచి సస్పెండ్ అయన వారు రాజ్యసభకు తీవ్ర అవమానం కలిగించారని అందులో పేర్కొన్నారు. తిరిగి వారిని ఎగువ సభలోకి అడుగు పెట్టకుండా చూసి.. సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. రాజ్యసభ ఛైర్మన్​కు క్షమాపణ కోరితేనే వారిపై ఉన్న సస్పెన్షన్​ను ఎత్తివేస్తామన్నారు. సభలో వారి ప్రవర్తన కారణంగానే వేటు పడిందని పేర్కొన్నారు.

సస్పెన్షన్​ అన్యాయం..

రాజ్యసభ ఎంపీలను సస్పెండ్(rajya sabha mps suspended)​ చేయటం పూర్తిగా అన్యాయమన్నారు సస్పెన్షన్​కు గురైన కాంగ్రెస్​ ఎంపీ ఛాయా వర్మ. ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం గందరగోళం సృష్టించారు, కానీ, ఛైర్మన్​ మమ్మల్నే సస్పెండ్​ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ ఉందన్న కారణంగా ప్రధాని మోదీ తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్య పూర్తిగా అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కూనీ చేయటమేనన్నారు కాంగ్రెస్​ ఎంపీ రిపున్​ బోరా.

జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టు(Supreme court news) వరకు నింధితుల వాదనలు సైతం వింటారని.. వారికి న్యాయవాదులను ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు సస్పెండ్​ అయిన శివసేన ఎంపీ ప్రియాంక ఛతుర్వేది. కానీ, ఇక్కడ మా వాదనలు వినేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎంపీలను పురుష మార్షల్స్​ ఏవిధంగా అడ్డుకుంటున్నారో సీసీటీవీ వీడియోలు చూడాలన్నారు.

విపక్షాల అత్యవసర భేటీ..

12 మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్​(rajya sabha mps suspended) చేసిన క్రమంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సమావేశమవ్వాలని పిలుపునిచ్చారు విపక్ష నేతలు. రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్​ ఖార్గే కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు.

తోమర్​ స్పందన..

నూతన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై ఎలాంటి చర్చ జరగకుండానే పార్లమెంటు ఆమోదం తెలిపడంపై కేంద్రాన్ని విపక్షాలు విమర్శించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు సాగు చట్టాలను రద్దు చేయాలని భావించిన తరుణంలో ఈ అంశంపై ఏకాభిప్రాయం ఏర్పడిందని చెప్పారు. లోక్​సభలో ఈ బిల్లుపై చర్చ ప్రారంభించాలని భావించినప్పటికీ.. ప్రతిపక్ష పార్టీలు చర్చకు ఆస్కారం ఇవ్వకుండా చేశాయని చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు తమ సీట్లలో తాము కూర్చున్నట్లైతే తాను చర్చ ప్రారంభించేవాడినని చెప్పారు.

ఇదీ చూడండి: 'సాగు చట్టాల రద్దు' బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

Last Updated : Nov 29, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.