కరోనా కారణంగా దేశంలో 119 సాయుధ సిబ్బంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. 44వేల 766 మంది వైరస్ బారిన పడ్డారని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపద్ నాయక్ తెలిపారు.
ఆర్మీలో 33 వేల 3మందికి కరోనా సోకగా, 81 మంది మృతిచెందారని నాయక్ తెలిపారు. నేవీలో 3, 604 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు చనిపోయారు. వాయుసేనలో కొవిడ్‌తో 36 మంది ప్రాణాలు కోల్పోగా.. 8, 159 మందికి వ్యాధి సోకింది.
అయితే నిబంధనల ప్రకారం, సైనికులు సేవలో ఉన్నప్పుడు అంటు వ్యాధి కారణంగా సంభవించే మరణాలకు ప్రత్యేక పరిహారం ఇవ్వడం లేదని శ్రీపద్ నాయక్ పేర్కొన్నారు. కానీ, సేవలో ఉన్నప్పుడు ఇలాంటి మరణాలన్నింటికీ పదవి విరమణ అనంతర ప్రయోజనాలు అందుతాయని స్పష్టంచేశారు.
ఇదీ చూడండి: భారతీయ టీకాలను పొరుగు దేశాలకు అమ్మేసిన దక్షిణాఫ్రికా