కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షాల ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరు జిల్లాల్లో రెడ్ అలెర్ట్‌ను (Kerala Red Alert) ప్రకటించింది. పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కీ, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్..
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టనున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. ఇందుకోసం 11 బృందాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ప్రభావిత ప్రాంతాలు సహా వరదలు తీవ్రమయ్యే (Kerala Red Alert) అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ డైరక్టర్ ఎస్ఎన్ ప్రధాన్ ట్వీట్ చేశారు. మలప్పురం, అలప్పుజా, ఎర్నాకులం, త్రిశూర్, పథనంతిట్ట, పాలక్కడ్, కొట్టాయాం, కన్నూర్, కొల్లాలం, ఇడుక్కీ ప్రాంతాల్లో ఈ బృందాలు సహాయక చర్యలు చేపడతాయని ప్రధాన్ పేర్కొన్నారు.
మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు (Kerala Rain Update) అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్యాం పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని పరిస్థితిపై ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
అపట్టి వరకు ఆలయం బంద్!
మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందు వల్ల శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ట్రావెన్కోర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది.
తులామాసం పూజల నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు శబరి ఆలయం తెరుచుకుంది.
ఇదీ చూడండి : కశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. లష్కరే కమాండర్ హతం