ETV Bharat / bharat

బంగాల్​ దంగల్​లో విజేత ఎవరు?

2021 బంగాల్ దంగల్​లో తుది ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టీఎంసీ- భాజపా మధ్య నువ్వా- నేనా అన్నట్టు సాగిన పోరులో విజయం ఎవరిని వరిస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ​ నెలకొంది.

108-centres-256-cos-of-central-forces-strict-covid-measures-all-set-for-may-2-counting-for-bengal-polls
మెగా వార్​: బంగాల్​ దంగల్​లో విజేత ఎవరు?
author img

By

Published : May 1, 2021, 5:09 PM IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. సుదీర్ఘంగా సాగిన ఎన్నికలు ముగియగా.. ఆదివారం కౌంటింగ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో బంగాల్​ రాజకీయాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. అధికార టీఎంసీ- విపక్ష భాజపా మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు యావత్​ దేశం సాక్ష్యంగా నిలిచింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీవైపే ప్రజలు ఉన్నారన్న ఎగ్జిట్​ పోల్స్​ అంచనాల నేపథ్యంలో ఆదివారం జరగనున్న కౌంటింగ్​ కోసం దేశ ప్రజలు అమితాసక్తితో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో.. కరోనా విజృంభణ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈసీ ఎంత సమర్థంగా చేపడుతుందనేది సర్వత్రా చర్చనీయంశమైంది.

బంగాల్​ దంగల్​

  • మొత్తం సీట్లు: 294
  • మ్యాజిక్​ ఫిగర్​: 148
  • పోలింగ్​: 8 విడతలు
  • ప్రధాన పోటీ: టీఎంసీ X భాజపా
  • మెగా వార్​: మమతా బెనర్జీ X సువేందు అధికారి (నందిగ్రామ్​)

కఠిన నిబంధనలు...

ఉదయం 8 గంటలకు కౌంటింగ్​ ప్రారంభం కానుంది. 108 కౌంటింగ్​ కేంద్రాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. కేంద్ర బలగాలకు చెందిన 256 కంపెనీలతో పాటు 292 మంది పరిశీలకులను నియమించింది.

ఇదీ చూడండి:- 'బంగాల్​లో ఇప్పటికీ మమతకే ప్రజాదరణ'

కరోనా నేపథ్యంలో కఠిన చర్యలు చేపట్టింది ఈసీ. కరోనా నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. ప్రతి కేంద్రంలో 15 రౌండ్లు శానిటైజేషన్​ చేసే విధంగా చర్యలు చేపట్టింది. మాస్కులు, ఫేస్​ షీల్డ్స్​, శానిటైజర్లను కౌంటింగ్​ కేంద్రాల బయట ఏర్పాటు చేసింది. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఓట్లను లెక్కించే విధంగా విస్తృత చర్యలు తీసుకుంది.

కౌంటింగ్​ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, వారి ఏజెంట్లు.. కచ్చితంగా కరోనా నెగిటివ్​ రిపోర్టును చూపించాలి. లేదా టీకా రెండు డోసులు తీసుకున్నట్టు ధ్రువపత్రాలను సమర్పించాలి.

అదే సమయంలో.. కౌంటింగ్​ కేంద్రాల బయట ప్రజలు గుమిగూడకుండా చర్యలు చేపట్టింది ఈసీ. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పని స్పష్టం చేసింది.

అంచనాలు నిజమయ్యేనా?

మూడోసారి కూడా బంగాలీలు దీదీకే పట్టం కట్టారన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల మధ్య బంగాల్‌ శాసనసభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, భారతీయ జనతా పార్టీ మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ సాగింది. బంగాల్‌లో హ్యాట్రిక్‌ సాధించాలని పట్టుదలతో సీఎం మమతాబెనర్జీ, ఈసారి ఎలాగైనా కాషాయజెండా ఎగురేయాలని ప్రధాని మోదీ, అమిత్​ షా సహా యావత్​ కమలదళం హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించింది.

ఎగ్జిట్​ పోల్స్​లో.. మొత్తం 4 సంస్థలు తృణమూల్‌ ​ కాంగ్రెస్​(టీఎంసీ) మూడోసారి అధికారం.. నిలబెట్టుకుంటుందని పేర్కొన్నాయి. రిపబ్లిక్‌ టీవీ-సీఎన్​ఎక్స్​, జన్‌కీ బాత్‌ మాత్రం భాజపా కూటమి అధికారం చేపడుతుందని అంచనా వేశాయి.

108-centres-256-cos-of-central-forces-strict-covid-measures-all-set-for-may-2-counting-for-bengal-polls
ఈటీవీ భారత్​ సర్వే

ఇదీ చూడండి:- బంగాల్​లో ఫలితాల లెక్కలను కరోనా మార్చేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.