కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు శతాధిక వృద్ధులూ టీకా తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన జె.కామేశ్వరి అనే 103 ఏళ్ల బామ్మ కొవిడ్ టీకా తొలి డోసు మంగళవారం వేయించుకున్నారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం దేశంలో టీకా తీసుకున్న అత్యంత వృద్ధురాలిగా కామేశ్వరి నిలిచారని బెంగళూరులోని అపోలో హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది.
నోయిడాకు చెందిన మరో 103 ఏళ్ల ఓ వృద్ధుడు మంగళవారం కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 2.5 కోట్లకుపైగా టీకాలు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రెండో విడత టీకా వేసే కార్యక్రమం కొనసాగుతోంది.
ఇదీ చూడండి: కొవిడ్ టీకాపై సంకోచమే అసలు సమస్య