ETV Bharat / bharat

అయోధ్యకు 1008 కి.మీ పరుగు- యువతలో ఆధ్యాత్మికత, ఫిట్​నెస్​ పెంపే లక్ష్యంగా మారథాన్​ - రన్నర్​ కార్తీక్​ జోషి

​1008 Kms Marathon To Ayodhya : ​మధ్యప్రదేశ్​లోని ఇందౌర్​ నుంచి అయోధ్య రామమందిరానికి 14 రోజుల పాటు ఏకంగా 1008 కిలోమీటర్లు పరిగెత్తేందుకు సిద్ధమయ్యాడు మధ్యప్రదేశ్​కు చెందిన అంతర్జాతీయ అల్ట్రా రన్నర్ కార్తీక్ జోషి. అతడు ఎందుకు అలా చేస్తున్నాడో? ఆ యువకుడి రన్నింగ్ వెనుక అంతర్యం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

1008 Kms Marathon To Ayodhya
1008 Kms Marathon To Ayodhya
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 8:31 PM IST

అయోధ్యకు 1008 కి.మీ పరుగు- యువతలో ఆధ్యాత్మికత, ఫిట్​నెస్​ పెంపే లక్ష్యంగా మారథాన్​

1008 Kms Marathon To Ayodhya : రన్నింగ్​ చేస్తూ అయోధ్యకు చేరుకుని శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమయ్యాడు మధ్యప్రదేశ్​ ఇందౌర్​కు చెందిన కార్తీక్​ జోషి. ఇందౌర్​ నుంచి మొత్తం 14 రోజుల పాటు 1008 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. జనవరి 22న అయోధ్యలో జరిగే రామయ్య ప్రాణప్రతిష్ఠకు హాజరయ్యేందుకు ఈనెల 5న తన పరుగు యాత్ర​ను ప్రారంభించనున్నాడు కార్తీక్​.

"ఒక్కోసారి ఒకటి లేదా రెండు రోజుల లాంగ్ రన్​లకు వెళ్తాను. అప్పుడు నేను శారీరకంగా అలసిపోతాను. అయితే ఆధ్యాత్మికతకు తోడు ఆత్మస్థైర్యం తోడైతే ఎన్ని వేల కిలోమీటర్లనైనా సులువుగా పూర్తి చేయగలం. నేను రన్నింగ్​ చేసేటప్పుడు నా బలం రాముడు, బజరంగ్​బలి మాత్రమే. చాలా ఏళ్ల తర్వాత రాముడు అయోధ్యలో కొలువుదీరబోతున్నాడు. అందుకే రన్​ చేస్తూ అయోధ్యకు వెళ్తున్నా. "
- కార్తీక్​ జోషి, మారథాన్​ రన్నర్​

తన ప్రయత్నం దేశ యువతలో ఆధ్యాత్మికతపై గౌరవం పెంచడమే కాకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేలా చేస్తుందని నమ్ముతున్నాడు కార్తీక్ జోషి. 'ప్రస్తుతం తరానికి ఆధ్యాత్మికతకు అనుసంధానం చేయాలనుకుంటున్నా. ​చిన్న చిన్న విషయాలకే చాలామంది డిప్రెషన్​లోకి వెళ్లిపోతున్నారు. ఎంత పెద్ద సమస్యనైనా మన ఆధ్యాత్మికత సులువుగా పరిష్కరించగలదు.' అని మారథాన్​ రన్నర్​ కార్తీక్ జోషి తెలిపారు.

కార్తీక్​ జోషి తీసుకున్న ఈ లాంగ్​ మారథాన్​ నిర్ణయం పట్ల అతడి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. 'అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడి శక్తిని యావత్ ప్రపంచం చూస్తోంది. 1008 కిలోమీటర్లు పరుగెత్తుకుంటూ వెళ్లి అయోధ్య రాముడికి మొక్కులు తీర్చుకుంటున్నాం" అని కార్తీక్ జోషి తండ్రి ఓం ప్రకాశ్ జోషి తెలిపారు.
కార్తీక్​ ఇంత దూరం పరుగెత్తడం ఇదే తొలిసారి. ఇందౌర్​లోని శ్రీ రంజిత్​ హనుమాన్ మందిరం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాడు.

Ram Mandir Opening Ceremony : మరోవైపు, అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు 2024 జనవరి 16వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామమందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.

జపాన్​ వరుస భూకంపాలకు 48 మంది బలి- భారీగా ఆస్తి నష్టం- రష్యా అలర్ట్!

ప్రయాణికులకు స్వాగతం పలికే గోపురం- ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కొత్త ఎయిర్​పోర్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.